బిగ్ బాస్, మహేశ్ కత్తి.. ఓ సెలబ్రెటీ కథ

బిగ్ బాస్ లో పాల్గొని రివ్యూ రైటర్, కం రచయిత మహేశ్ కత్తి ఫేమస్ అయిపోయాడు. తొలివారమే ఎలిమినేట్ అవుతాడని ఆశించినా.. 5వవారం వరకు ఉండి ఆశ్చర్యపరిచాడు. ఇక తాను ఎలిమినేట్ కావడానికి ఆ చిన్న తప్పే కారణమని మహేశ్ కత్తి చెప్పాడు.

గతంలో సమీర్ కూడా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ను సరిగా చేయలేక హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఇప్పుడు మహేశ్ కత్తి కూడా తోటి సభ్యులకు ఇచ్చిన ముళ్ల సింహాసనం టాస్క్ లో పర్యవేక్షకుడిగా బిగ్ బాస్ ఆదేశాలను పాటించకుండా ఉల్లంఘించాడు. దీంతో బిగ్ బాస్ హౌస్ నుంచి మహేశ్ కత్తిని ఎలిమినేట్ చేశారట.. తాను వైదొలగడానికి ప్రధాన కారణం టాస్క్ లో బిగ్ బాస్ ఆదేశాలను పాటించకపోవడమేనని మహేశ్ కత్తి ఎన్టీఆర్ కూడా చెప్పి వాపోయాడట.. బిగ్ బాస్ హౌస్ నుంచి మహేశ్ కత్తి ఎలిమినేట్ అయ్యాక ఫుణె నుంచి ముంబై వెళ్లి అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ వచ్చేశాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో మహేశ్ కత్తికి ఊహించని అనుభవం ఎదురైందట..

ఇప్పటివరకు తాను ఎక్కడికి వెళ్లిన ఎవరూ గుర్తుపట్టి పలకించిన పాపాన పోలేదట.. కానీ బిగ్ బాస్ హౌస్ లోంచి వచ్చాక చాలామంది ఎయిర్ పోర్టులో సెల్ఫీలు దిగాలని , ఆటోగ్రాఫ్ లు ఇవ్వాలని కోరడంతో.. తాను బిగ్ బాస్ వల్ల సెలబ్రెటీ అయ్యానని మహేశ్ కత్తి ఆనందం వ్యక్తం చేశాడట.. ఇక బిగ్ బాస్ షోలో పాల్గొనడంపై మహేశ్ కత్తి ఓ మీడియాతో మాట్లాడారు. బిగ్ బాస్ పై ఒక పుస్తకం రాస్తానని.. అందరి బండారం అందులో బయటపెడతానని హెచ్చరికలు పంపారు.

To Top

Send this to a friend