మహాత్మా గాంధీ కాంగ్రెస్ ను రద్దు చేయమంది అందుకే..

‘అధికారం కోసం కాంగ్రెస్ వాళ్లు ఏమైనా చేస్తారు.. ఆ అధికారం దాహంతోనే అవినీతి, అక్రమాలు గడిచిన 60 ఏళ్లుగా కొనసాగాయి. ఈ కారణంతోనే నాడు మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీని స్వాతంత్ర్యానంతరం రద్దు చేయాలని వాదించారు. కానీ నాడు గాంధీని వ్యాపారి అంటూ విమర్శించారు.. ఇప్పుడు కొందరు కాంగ్రెస్ పనిని పూర్తి చేస్తున్నారని’ అమిత్ షా సంచలన ఆరోపణలు చేశాడు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని సమాయత్తం చేయడంలో భాగంగా ప్రతీ రాష్ట్రంలో పర్యటిస్తున్న అమిత్ షా.. చత్తీస్ ఘడ్ ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ పుట్టుక, దాని అవినీతి మీద వ్యాఖ్యానిస్తూ మహాత్మాగాంధీని రాజకీయాల్లోకి లాగడం దుమారం రేపుతోంది.

కాంగ్రెస్ పార్టీని స్వాంత్రంత్య సాధనకు మాత్రమే గాంధీ ఉపయోగించాడని అమిత్ షా తెలిపారు. నాడు బ్రిటీషర్లు కేవలం తమతో సంప్రదింపులు జరిపేందుకు మాత్రమే ఓ సంఘంగా కాంగ్రెస్ ను గుర్తించారని కానీ.. కొందరు నేతలు దాన్ని స్వాతంత్ర్యానంతరం రాజకీయ పార్టీగా మార్చి ఒక కుటుంబమే దేశాన్ని ఏలేలా చేశారని అమిత్ షా మండిపడ్డారు.

మహాత్మా గాంధీని రాజకీయాల్లోకి తీసుకొచ్చి అమిత్ షా ధైర్యం చేశారనే చెప్పవచ్చు.. ఎందుకంటే మహాత్మాగాంధీది గుజరాతే.. ఆ గుజరాత్ నుంచే వచ్చిన అమిత్ షా ఇప్పుడు ఆయన్ను వాడుకోవడంపై కాంగ్రెస్ మండిపడింది. కాంగ్రెస్ పార్టీని గాంధీ రద్దు చేయాలని కోరడాన్ని రాజకీయ అవకాశంగా మలుచుకున్న అమిత్ షా కాంగ్రెస్ చేసిన విమర్శ ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.

అమిత్ షా: నాడు మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని వాదించారు.
అమిత్ షాతొ మీరు ఎకీభవిస్థునారా?

To Top

Send this to a friend