సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌పై `మా` కార్య‌వ‌ర్గం వివ‌ర‌ణ‌..

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా)కు సంబంధించి సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌పై `మా` కార్య‌వ‌ర్గం వివ‌ర‌ణ‌

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా) కార్య‌వ‌ర్గంలో భేదాభిప్రాయాలు వ‌చ్చాయ‌ని, అధ్య‌క్షుడు న‌రేశ్‌కి రాజ‌శేఖ‌ర్ కార్య‌వ‌ర్గం నోటీసులు ఇవ్వ‌బోతుందంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ విష‌యం తెలిసిన `మా` కార్యనిర్వాహ‌క వర్గం ఈ వార్త‌ల‌ను తీవ్రంగా ఖండించింది. “ఓ అసోసియేష‌న్ అంటే.. చాలా స‌మ‌స్య‌లుంటాయి. వాటన్నింటినీపై అంద‌రూ చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది. `మా` వెల్ఫేర్‌కి సంబంధించి అత్య‌వ‌స‌రంగా తీసుకోవాల్సిన చ‌ర్య‌లు గురించి మంగ‌ళ‌వారం ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జ‌రిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌కు సంబంధించి మీడియాకు తెలియ‌జేయాల్సిన వార్త‌లేవైనా ఉంటే అధికారికంగా మేమే తెలియ‌జేస్తాం“అంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ కార్య‌వ‌ర్గం తెలియ‌జేసింది.

To Top

Send this to a friend