మళ్లీ మళ్లీ కలిసిరాదు


నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. బాలయ్య 100వ భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ అయిన నేపథ్యంలో ప్రస్తుతం 101వ సినిమాగా ‘పైసా వసూల్‌’ చిత్రాన్ని చేస్తున్నాడు. పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాను దసరా కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇక ‘పైసా వసూల్‌’ పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే తమిళ దర్శకుడు రవికుమార్‌ దర్శకత్వంలో బాలయ్య సినిమా చేయబోతున్నాడు.

సి కళ్యాణ్‌ నిర్మాణంలో బాలయ్య 102వ చిత్రంగా తెరకెక్కబోతున్న చిత్రాన్ని 2018 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఇంకా షూటింగ్‌ కూడా ప్రారంభం కాకుండానే బాలయ్య సంక్రాంతిపై గురి పెట్టడం అందరిని ఆశ్చర్యంకు గురి చేస్తుంది. బాలయ్య 100వ సినిమా సంక్రాంతికి విడుదల అయ్యి ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. అందుకే మరోసారి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్‌ను సాధించాలని బాలయ్య భావిస్తున్నాడు.

తమిళంలో ఎన్నో చిత్రాలు తెరకెక్కించి సక్సెస్‌ అయిన దర్శకుడు రవికుమార్‌ ప్రస్తుతం బాలయ్య కోసం మాస్‌ మసాలా స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు నుండి బాలయ్య 102వ సినిమా ప్రారంభం కాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

To Top

Send this to a friend