ప్రేమపక్షులను కలిపి.. ఆమెను పంపించేస్తున్నారు..

ఈ ఆదివారం ఎలిమినేట్ అవుతూ కల్పన వేసిన బిగ్ బాంబ్ ధాటికి బిగ్ బాస్ లోని ప్రిన్స్, దీక్ష ప్రేమ పక్షులుగా మారిపోతున్నారు. దీక్ష ఎక్కడి వెళ్లాలన్న ప్రిన్స్ తలుపు తీసేలా ఆమె ద్వార పాలకుడిగా ఉండాలని కల్పన శిక్ష విధించింది. ఇది వారిద్దరి మధ్య ప్రేమకు దారితీస్తోంది. ఇద్దరూ అండర్ స్టాండింగ్ తో ప్రేమగా ముందుకెళ్తున్నారు. ఇన్నాళ్లు బిగ్ బాస్ లో అంటీముట్టనట్టుగా ఉన్నప్రిన్స్, దీక్షలు ఇప్పుడు కొంచెంకొంచెం దగ్గరవుతున్నారు.

బిగ్ బాస్ లోని సెలబ్రెటీలు వారానికొకరు చొప్పున ఎలిమినేట్ అవుతుండడంతో అందరిలోనూ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్న ఆసక్తి నెలకొంది. అనుకున్నట్టే బిగ్ బాస్ లో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ వారం ఎలిమినేషన్ జాబితాను బిగ్ బాస్ ప్రకటించారు. ఇందులో అర్చన , ధన్ రాజ్, హరితేజ, ముమైత్ ఖాన్ లు ఉన్నారు.

ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియలో అందరికంటే ముందుంది అర్చన. ఆ తర్వాత రేసులో ధన్ రాజ్, హరితేజ, ముమైత్ ఖాన్ ఉన్నారు. వీరిలో అర్చన బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోవాలని మిగతా అందరు సెలబ్రెటీలు ఓటింగ్ లో కోరడం జరిగింది. ఆమె చాడీలు ఎక్కువగా చెబుతూ అందరి మధ్య గొడవలు పుట్టిస్తోందని మిగతా సభ్యులంతా అర్చననే ఎలిమినేషన్ కు నామినేట్ చేశారు. దీంతో ఈ పరిణామానానికి కలత చెందిన అర్చన నిన్న ఎవ్వరితోనూ మాట్లాడలేదు.

To Top

Send this to a friend