కాస్త అతి అయ్యింది గురు


ఒక సినిమా సక్సెస్‌ అయినప్పుడు నిసిగ్గుగా ఆ విజయాన్ని ప్రశంసించాలి. అప్పుడే మర్యాదగా ఉంటుంది. అలా కాదు అని, సినిమాలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ, తాను చేస్తే ఇది ఇంకా ఎక్కువ విజయం సాధించదని, తాను చేసిన ఆ చిత్రం ఇంత కంటే భారీ విజయాన్ని సాధించింది అంటూ చెప్పడం వారి వారి అవివేకం అవుతుంది. తాజాగా ‘బాహుబలి 2’ సాధించిన విజయాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించాల్సిందే. ముఖ్యంగా సౌత్‌ వారి స్థాయిని పెంచినందుకు ‘బాహుబలి 2’ చిత్రంను గౌరవించాలి.

కాని ‘బాహుబలి’ సినిమాను మన సౌత్‌ వారే కొందరు విమర్శించడం దురదృష్టం. తాజాగా తమిళ దర్శకుడు రవికుమార్‌ ‘బాహుబలి 2’పై వింత వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో తాను రజినీకాంత్‌తో ‘రానా’ అనే చిత్రాన్ని ప్రారంభించాను. ఆ సినిమా పూర్తి అయ్యి ఉంటే ‘బాహుబలి’ని మించిన సక్సెస్‌ అయ్యేది. కాని ఆ సినిమా ఆరంభంలోనే ఆగిపోయింది అంటూ ఈయన చెప్పుకొచ్చాడు.

నందమూరి బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం తమిళంలో విడుదల కాబోతుంది. చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలోనే రవికుమార్‌ ‘బాహుబలి’పై వ్యాఖ్యలు చేశాడు. ‘రానా’ సినిమాతో బాహుబలి క్రాస్‌ చేస్తాను అనే నమ్మకం ఉంటే ఇప్పుడైనా ఆ కథతో సినిమా చేయవచ్చుగా అంటూ కొందరు ఎద్దేవ చేస్తున్నారు.

To Top

Send this to a friend