లగడపాటి సర్వే.. నంద్యాల విజేత ఆ పార్టీనేనట..

పార్లమెంటు లో పెప్పర్ స్ప్రే కొట్టి వివాదాస్పద ఎంపీగా గుర్తింపు తెచ్చుకున్న మాజీ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఏపీలో కాంగ్రెస్ తో పాటు అంతర్థానం అయిపోయారు.. ఒకప్పుడు ఫేమస్ ఎంపీ, కాంట్రవర్సికి మారుపేరుగా ఉన్న లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు . వినిపించడం లేదు.. ఆయన చేయించే సర్వేలపై మాత్రం ఇప్పటికీ జనంలో విశ్వసనీయత ఉంది.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ లగడపాటిని దేశంలో ఎక్కడ ఎన్నికలున్నా ముందస్తుగా లగడపాటి తో చెప్పి సర్వేలు చేయించేవారట.. ఆ సర్వే ఫలితాలు నూటికి నూరు శాతం ఫలితాలను ఇఛ్చేవి. అందుకే తెలుగు రాష్ట్రాల్లో కూడా లగడపాటి సర్వేలపై విశ్వసనీయత ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణ, ఏపీ విడిపోయాక లగడపాటి , ఆయన సర్వేలు రెండూ లేకుండా పోయాయి.

కానీ ఇప్పుడు లగడపాటి నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో చేసిన సర్వే రాజకీయంగా సంచలనంగా మారింది. నిన్న ఓటింగ్ పూర్తి అయ్యాక లగడపాటి తన సర్వే వివరాలను బయటపెట్టారు. ఓటింగ్ శాతం పెరగడంతో ఫలితంలో మార్పు వస్తుందని.. విజయం తమేదేనని ప్రకటించిన వైసీపీ ఆశలపై నీళ్లు చల్లారు. నంద్యాలలో 1,73,335 మంది ఓటు వేసినందున టీడీపీకి 17,333 ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని తన సర్వేలో తేలిందని లగడపాటి జోస్యం చెప్పారు. మెజార్టీ 20వేల వరకు కూడా పెరగవచ్చని కానీ నంద్యాలలో గెలుపు టీడీపీదేనని స్పష్టం చేశారు.

To Top

Send this to a friend