ఏపీ ఎన్నికలపై లగడపాటి కామెంట్‌..

తిరుమల: ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు అనుభవజ్ఞులకే పట్టం కడతారని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్ రీత్యా అనుభవజ్ఞులైన నాయకుల అవసరం ఉందన్నారు. ఓటేసేముందు అభివృద్ధి, సంక్షేమం రెండిటినీ ప్రజలు చూస్తారని చెప్పారు. మే 19న తుది విడత ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సర్వే ఫలితాలు వెల్లడిస్తానన్నారు.

To Top

Send this to a friend