పవన్ కోసం లేడి అభిమాని ఏం చేసిందంటే..

సంవత్సర క్రితం కూడా జ్యోతి పవన్ కోసం ఆయన ఇంటి ముందు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న మరోసారి జూబ్లీహిల్స్ లోని పవన్ ఇంటిముందు తన అభిమాన హీరోను కలవడానికి అనుమతించాలని దీక్షకు దిగి కలకలం సృష్టించింది.
జ్యోతికి ఎంత చెప్పినా అక్కడి నుంచి వెళ్లకపోవడంతో పవన్ పర్సనల్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి జ్యోతిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్లారు. పవన్ అభిమాని జ్యోతి రోడ్డుపై చేసిన హల్ చల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జ్యోతి.. హిమాయత్ నగర్ లో టీచర్ గా పనిచేస్తోంది. పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఆయనంటే పడిచస్తుంది. పవన్ కోసం ఏమైనా చేస్తుంది. అంతటి అభిమాని నిన్న పవన్ ఇంటి ముందుకొచ్చింది. ఆయనను కలవడానికి లోపలికి పంపాలని సెక్యూరిటీని కోరింది. దానికి వారు ససేమిరా అనడంతో పవన్ కోసం రోడ్డు మీదే అర్ధరాత్రి వరకు వేచిచూసింది..

To Top

Send this to a friend