నారా లోకేష్, గల్లా జయదేవ్ కి కేటిఆర్ ఆహ్వానం…?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెడతాం అని చెప్పిన తెరాస పార్టీ ఇప్పుడు రూటు మార్చుకోవడంతో జగన్ కి ఇబ్బందులు తప్పేలా లేవనే అభిప్రాయం కొన్ని రోజులుగా వినపడుతుంది. కేంద్రంలో మోడీ వచ్చే అవకాశాలు ఒక్క శాతం కూడా లేకపోవడం కెసిఆర్ చంద్రబాబుని నమ్ముకు౦తున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఏర్పాటు చేసిన కూటమికి చంద్రబాబే కీలకంగా మారిపోయారు. దీనితో ఆయన ప్రాధాన్యత రోజు రోజు కి పెరగడం కెసిఆర్ ని దారుణంగా కలవరపెడుతుంది.

ఈ నేపధ్యంలో చినజీయర్ స్వామిని చంద్రబాబు వద్దకు రాయబారానికి పంపినట్టు వార్తలు వచ్చాయి. అసలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల వెళ్ళను అనే చెప్పిన చినజీయర్… అదే ఏడుకొండల వాడి పఠం చంద్రబాబుకి ఇచ్చి అతి వినయం ప్రదర్శించారు. ఇక చినజీయర్ కలిసిన తర్వాత ఎన్నికల సంఘం కూడా డ్రాప్ అయిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అటు సియేస్ ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా చంద్రబాబు విషయంలో దూకుడు తగ్గించి తండ్రి కొడుకు సూత్రాలు చెప్పడం మొదలుపెట్టారు.ఇక ఈ తరుణంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబుని మరింత దగ్గర చేసుకునే ప్రయత్నాలను కేటిఆర్ కూడా మొదలుపెట్టినట్టు సమాచారం. ఎన్నికల సమయంలో చంద్రబాబు మీద దారుణంగా వ్యాఖ్యలు చేసిన తండ్రి కొడుకులు ఆంధ్రా ఎన్నికల్లో చంద్రబాబు పదే పదే వాళ్ళని తిడుతున్నా ఎక్కడా కూడా నోరు మెదిపి విమర్శలు మాత్రం చేయలేడు. ఒకానొక సందర్భంలో కెసిఆర్ పట్టిసీమ ప్రాజెక్ట్ గురించి కూడా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ఎన్నికల తర్వాత వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు…

రావడంతో చంద్రబాబుకి దగ్గర కావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఏదైనా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి మంత్రి లోకేష్ ని, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ని ఆహ్వానించాలని కేటిఆర్ భావిస్తున్నారట. ఇది ఎన్నికల ఫలితాలు తర్వాతైనా, ఈ లోపు అయినా ఉండే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. వారికి ఆహ్వానం ఇవ్వడానికి అవసరం అయితే కేటిఆర్ స్వయంగా రావాలని భావిస్తున్నారట. అయితే ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని ఈ పరిణామం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.

To Top

Send this to a friend