‘అర్జున్ రెడ్డి’ని చూసి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..

అర్జున్ రెడ్డి సినిమాకు ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. ఓ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన వాస్తవ సంఘటనలు.. ఓ వ్యక్తి నిజజీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా విడుదలై మంచి టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ ఒరిజినల్ కథ చూసి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఫిదా అవుతున్నారు. ఇటీవలే అర్జున్ రెడ్డి సినిమా చూసిన సమంత కూడా ఆ సినిమాపై ప్రశంసలు కురిపించింది.

ఇక తాజాగా ఈ సినిమాను చూసిన కేటీఆర్ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండ ఇరగదీశాడని మెచ్చుకున్నారు. చిత్ర నిర్మాత, దర్శకుడిని ప్రత్యేకంగా అభినందించారు. సినిమాలోని ఫేమస్ పదాలను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేసి ట్వీట్ చేస్తూ సినిమా యూనిట్ ను ప్రశంసించారు. ఇది మనసుకు హత్తుకునే ఒక నిజాయితీని ప్రతిబింబించే చిత్రమని అభివర్ణించారు. బోల్డ్ గా తీసిన ఈ అద్భుత చిత్రాన్ని నిజజీవిత కథ ఆధారంగా తీసేందుకు చాలా ధైర్యం కావాలని దర్శకుడిని అభినందించారు.

అయితే ఈ సినిమాలో కాస్త రొమాంటిక్ , ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో అన్నివర్గాల నుంచి విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అర్జున్ రెడ్డి సినిమా ముద్దు పోస్టర్ ను చించడం.. దానికి రాంగోపాల్ వర్మ స్పందించి.. వీహెచ్ ను కడిగేయడం తెలిసిందే.. కానీ కేటీఆర్ సినిమా అద్భుతమంటూ ట్వీట్ చేయడంతో అందరి దృష్టి నెలకొంది. ‘అర్జున్ రెడ్డి’ మూవీ ఇటీవలే విడుదలైన ఘనవిజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ దర్శకత్వంలో దర్శకుడు సందీప్ రెడ్డి తీసిన ఈ సినిమాకు ప్రణయ్ భాస్కర్ నిర్మాత.

To Top

Send this to a friend