ఖేల్ ఖతమేనా..?


గెలిచినంత వరకు ఆయన దేవుడు స్వామీ అని కీర్తించిన ఆప్ ఎమ్మెల్యేలు ఇప్పుడు అదే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయేసరికి ఓటమికి కేజ్రీవాలే కారణమని దుమ్మెత్తిపోస్తున్నారు. నిన్నటి వరకు హీరో అని కీర్తించిన వారే ఇప్పుడు ఆయన.. ఆయన చుట్టూ ఉన్న  కోటరీ చేయడం వల్లే ఆప్ భష్టు పట్టిపోతోందని.. వారే ఆప్ ఓటమికి కారుకులనీ ఆరోపిస్తున్నారు. తాజాగా ఆప్ నేతలు అల్కా లాంబా, కపిల్ మిశ్రాలు కేజ్రీవాల్ తీరును బహిరంగంగా విమర్శించారు.. ఈ వ్యాఖ్యలకు ఆప్ సీనియర్ నేత విశ్వాస్ కూడా సమర్థించారు. ప్రజలు ఆప్ ను తిరస్కరించారని ఆయన కుండబద్దలు కొట్టారు.

ఈవీఎంల వల్లే ఓడామని ఓ పక్క ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెబుతున్నారు. కానీ ఆప్ సీనియర్ నేతలు మాత్రం ఆప్ ను ప్రజలు తిరస్కరించారని … ఎన్నికల్లో ఆప్ కు జనం ఓటేయలేదంటున్నారు. అంతేకాదు.. ఇప్పటికే 12 మంది ఆప్ ఎమ్మెల్యేలపై కేసులు అయ్యి వారు వచ్చే ఎన్నికల్లో పోటీచేయకుండా పోయారు. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ ఓటమి.. బీజేపీ గెలుపుతో బీజేపీ పార్టీలోకి దుమికేందుకు చాలా మంది ఆప్ ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారట.. ఈ లెక్కన ఆప్ ప్రభుత్వం కూలిపోవచ్చనే సందేహం వ్యక్తం అవుతోంది..

ప్రధానంగా ఢిల్లీలో ఓటమి.. ఆప్ అధినేత కేజ్రీవాల్ ను కృంగదీసింది. సర్జికల్ స్ట్రైక్ చేసిన మోడీని, జవాన్ల ను విమర్శించిన కేజ్రీవాల్ పై అప్పుడే జనాగ్రహం వ్యక్తమైంది. ఇప్పుడు అది కనిపించింది. పార్టీ పెట్టి ఒంటిచేత్తో బీజేపీని మట్టికరిపించిన కేజ్రీకి రెండేళ్లు తిరగకముందే ప్రజావ్యతిరేకత ఎదురుకావడం ఎవ్వరూ ఊహించలేనిది… ఎక్కడ దారుణంగా ఓడారో.. అక్కడే గెలుపురుచి చూసిన మోడీ-అమిత్ షా ల ద్వయం కు హ్యాట్సాఫ్.. నవ్విన నాపచేనే పండు అంటే ఇదేనేమో..

To Top

Send this to a friend