ఖాన్ త్రయానికి ఎఫెక్ట్


సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ టీజర్ ‘ట్యూబ్ లైట్’ టీజర్ నిన్న బాలీవుడ్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇప్పటికే భజరంగీ భాయ్ జాన్ సినిమాతో ఇండో పాక్ మధ్య సున్నిత అంశాలు.. ప్రజల సంఘర్షణను కళ్లకు కట్టినట్టు చూపిన దర్శకుడు కబీర్ ఖాన్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు… 1962లో జరిగిన భారత్-చైనా యుద్ధం నేపథ్యంలో సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో చైనా అమ్మాయిని ప్రేమించే యువకుడిగా సల్మాన్ నటిస్తున్నాడు. ఈ యుద్ధంలో ప్రేమ జంట ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారన్నది అసలు స్టోరీ..

అయితే బాహుబలి లాంటి వండర్ , ఎమోషన్, అద్భుత గ్రాఫిక్స్ సినిమా చూసిన బాలీవుడ్ జనాలకు సల్మాన్ నటిస్తున్న ట్యూబ్ లైట్ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. ఈ మేరకు యూట్యూబ్, సోషల్ మీడియాల్లో రిలీజ్ చేసిన ట్యూబ్ లైట్ టీజర్ పై అభిమానులు తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు..

ఒక ప్రాంతీయ తెలుగు భాష చిత్రం మార్కెట్ లేకున్నా.. అంత భారీ ఖర్చు, విజువల్ ఎఫెక్ట్, మంచి కథను ఎంచుకొని దేశవ్యాప్తంగా రికార్డులు కొల్లగొడుతుంటే.. వందల కోట్ల మార్కెట్ కలిగియున్న సల్మాన్, అమీర్, షారుఖ్ లాంటి హీరోలు ఇంకా మూస లవ్, కామెడీ చిత్రాలు చేయడమేంటని అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సల్మాన్ ట్యూబ్ లైట్ టీజర్ అంతకుముందు సల్మానే తీసిన భజరంగీ భాయ్ జాన్ కాపీలా ఉందని.. బాహుబలిని చూసి అలాంటి సినిమాలు తీయాలని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ల పరంపర కొనసాగిస్తున్నారు. దీంతో బాలీవుడ్ హీరోలకు ఈ కామెంట్లు షాక్ కు గురిచేస్తున్నాయి. ఇప్పటికైనా మారాల్సిన అవసరాన్ని ఆ హీరోలకు గుర్తు చేస్తున్నాయి.

To Top

Send this to a friend