ఖబడ్దార్.. మా తాత, తండ్రి ముఖ్యమంత్రులు..


సోషల్ మీడియాలో తనను అవమానించేలా జరుగుతున్న ప్రచారంపై నారా లోకేష్ స్పందించారు. తప్పుడు రాతలు, తప్పుడు కూతలకు జడుసుకునే వంశం కాదు అంటూ నారా లోకేష్ కొంచెం బేస్ పెంచి ప్రతిపక్ష వైసీపీ నేత జగన్ కు సవాల్ విసిరారు. విశాఖపట్నంలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న లోకేష్ ఈ మేరకు తనపై గుంటూరు రైతు దీక్షలో జగన్ చేసిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు.

మా వంశానికి ఘనమైన చరిత్ర ఉందని.. తాతలు, తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేశారని.. జగన్ చేసే విమర్శలు తన కాలి గోటికి కూడా సరిపోవని సవాల్ విసిరారు. తనను , పార్టీ నాయకులను, క్యాడర్ ను నిరుత్సాహ పరచడానికి వైసీపీ టీం సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొడతామని లోకేష్ సమాధానమిచ్చారు.

తనను లోక్యాష్ అంటూ జగన్ సంబోధించడంపై లోకేష్ సమాధానమిచ్చారు. క్యాష్ లేనిదే.. పనులు చేయనన్న ధోరణితోనే లోకేష్ ఉన్నాడన్న జగన్ కామెంట్లపై ఘాటుగా స్పందించారు.
జగన్ ఇంటా బయటా చేస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వక నిశ్శబ్ధంగా ఉంటే కార్యకర్తల్లో కూడా నిస్తేజం పెరుగుతుందని.. అందుకే తాను జగన్ కు సవాల్ చేస్తున్నానని తెలిపారు. ఆరోపణలు చేసే వాళ్లు రుజువులు చూపాలని, అసలు ఇటువంటి తాటాకు చప్పుళ్లకు తాను బెదరనని లోకేష్ స్పష్టం చేశారు.

To Top

Send this to a friend