కేసీఆరా..? మజాకా.?


దిష్టిబొమ్మల దహనాలు.. క్షీరాభిషేకాలు..
కేసీఆర్ స్ట్రాటజీనే వేరు.. సమస్యను పీక్ స్టేజ్ దాకా తీసుకెళ్లడం.. నిరసనకారులు కేసీఆర్ దిష్టిబొమ్మలను తగలేసే దాకా వెయిట్ చేయడం ఆయన హాబీ… ఆ తర్వాత మెల్లగా వారిని తన దగ్గరకు రప్పించి వరాలు కురిపిస్తుంటారు.. ఆ తర్వాత కేసీఆర్ బొమ్మలను కాల్చిన వారే క్షీరాభిషేకాలు చేస్తుంటారు. ఇలాంటి అరుదైన సంఘటనలు కేవలం తెలంగాణలోనే జరుగుతాయి. అదీ కేసీఆర్ కే చోటుచేసుకుంటాయి.

తెలంగాణలో కొద్దిరోజులుగా తమకు కనీస వేతనాలు ఇవ్వాలని ఆశావర్కర్లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. మిగతా వారందరికీ వరాలు కురిపించిన కేసీఆర్ తమను మాత్రం విస్మరిస్తున్నాడని.. జీతాలు పెంచడం లేదని.. కనీస వసతులు, సౌకర్యాలు కల్పించడం లేదని కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.

అయితే ఆశాల నిరసనలు పీక్ స్టేజ్ కి వెళ్లాక కేసీఆర్ మెల్లగా వారందరిని నిన్న తన నివాసానికి రప్పించుకున్నారు. నెలకు ఆరువేల చొప్పున జీతాలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఈ నెలనుంచే అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు విద్యార్హతను బట్టి వారికి ప్రమోషన్లు ఇస్తామని ప్రకటించారు. దీంతో ఆశలు ఉబ్బితబ్బిబై బయటకు వచ్చాక కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. ఎవరైతే తన బొమ్మలు కాల్చారో.. వారిచేత శభాష్ అనిపించుకోవడం కేవలం కేసీఆర్ కే చెల్లు..

To Top

Send this to a friend