రహస్య నివేదిికల్లోని ‘పచ్చి నిజాలు’

వచ్చే 2019  ఎన్నికలలో సీఎం కేసీఆర్ కుమారుడు, మున్సిపల్ & ఐటీ శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు నగరంలోని ఉప్పల్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. సిరిసిల్లలో కేటీఆర్ పై వ్యతిరేకత ఎక్కువగా ఉన్నట్లుగా ఇటీవల సీఎం జరిపిన రహస్య సర్వేలో వెల్లడైంది. సీఎం కూడా తన మకాంను గజ్వేల్ నుంచి  సిద్ధిపేటకు మార్చనున్నారు. అదే జరిగితే హరీష్ రావును పాత కరీంనగర్ వైపుగా పంపించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలిసింది. గజ్వేల్ లో కూడా ముఖ్యమంత్రికి రహస్య సర్వేలో కూడా కొన్ని  ప్రతికూల ఫలితాలే వచ్చాయి. కేసీఆర్ గజ్వేల్ లో తీప్ర ప్యతిరేకత ఎదుర్కొనే అవకాశాలున్నాయని సీఎం కు ఇంటలిజెన్స్ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేసాయి. బీజేపీ కదలికలు పెరిగిన నేపధ్యంలో త్వరలో టీఆర్ఎస్ పార్టీలో, మంత్రివర్గంలో భారీ మార్పులు ఉండబోతున్నాయి. రహస్య నివేదిికల్లోని ‘పచ్చి నిజాలు’ అధ్యయనం చేసిన కేసీఆర్ రెండు రోజుల పాటు తీప్రంగా కలవరపడ్డట్లుగా సీఎం కార్యాలయ వర్గాల ద్వారా తెలిసింది.

To Top

Send this to a friend