కేసీఆర్.. నాకు గానీ కోపమొచ్చిందో..

‘కేసీఆర్ నాకు గానీ కోపం వచ్చిందో ఏం చేస్తానో నాకే తెలియదు’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రతిపక్ష నేత జానారెడ్డి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.. నాకు సంయమనం ఎక్కువని.. హద్దులు మీరనని తెలంగాణ యాస, భాషలలో తిట్టడం తనకు తెలుసని.. కానీ తమకు సంస్కారం ఉందని అలా మాట్లాడమని జానారెడ్డి సుతిమెత్తగా ఎవరికీ అర్థం కానీ రీతిలో అనేశాడు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడిన జానా రెడ్డి కేసీఆర్ ఇటీవల కాంగ్రెస్ ను పిశాచి అనడంపై మండిపడ్డారు..

కేసీఆర్ దే పైశాచికత్వం అని.. అధికార మదంతో మాట్లాడుతున్నాడని జానారెడ్డి మండిపడ్డాడు. సీఎం పీఠంలో కూర్చున్న వ్యక్తి మాట్లాడే భాష ఇది కాదని స్పష్టం చేశారు. తాము కేసీఆర్ లా మాట్లాడమని తమది డీసెంట్ పార్టీ అని అన్నారు. అసలు కేసీఆర్ కు రాజకీయంగా జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని జానా రెడ్డి స్పష్టం చేశారు..

ఇలా జానారెడ్డి సుతిమెత్తగా మాట్లాడిన మాటలు తోటి కాంగ్రెస్ నాయకులకే మింగుడు పడడం లేదట.. కేసీఆర్ తిట్టిన తిట్లు, వాడిన భాషకు సీనియర్ గా చురకలు అంటిస్తారని విలేకరుల సమావేశానికి జానారెడ్డిని పిలిస్తే ఆయన కాంగ్రెస్ కు సపోర్ట్ గా మాట్లాడాల్సింది పోయి పత్రికలు చేతబట్టి కేసీఆర్ తిట్టిన తిట్లు వల్లెవేయడంపై పక్కనే ఉన్న కాంగ్రెస్ నాయకులు తలపట్టుకున్నారట.. జానారెడ్డి కేసీఆర్ ను తిట్టకుండా.. కేసీఆర్ తిట్టిన తిట్లను వల్లెవేయడంతో కాంగ్రెస్ పరువును మరోసారి తీశారని కాంగ్రెస్ నాయకులు మథన పడ్డట్టు సమాచారం. ఇలా జానారెడ్డి ని అనవసరంగా పిలిచాం దేవుడా అని వాపోయారట కాంగ్రెస్ నాయకులు. ఇలా మన జానారెడ్డి ఎప్పుడు ఏం చేస్తారో.. ఎలా ప్రవర్తిస్తారో తెలియక కాంగ్రెస్ నాయకులకు దిమ్మదిరిగిపోయిందట..

To Top

Send this to a friend