ప్రతిపక్షాలను గొర్రెలన్న కేసీఆర్..

కేసీఆర్ మాట శివగామి కంటే పవర్ ఫుల్. ఆయన సందర్భానుసారం వేసే సెటైర్లు ప్రతిపక్షాలకు శూలాల్ల గుచ్చుకుంటాయి. వేదికకు హాజరైన జనాలకు మాత్రం నవ్వులు పూయిస్తాయి. కేసీఆర్ మాటల మరాఠి అని మరోసారి నిరూపితమైంది.. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ పథకంలో కేసీఆర్ మాటల తూటాలు పేల్చాడు.

కేసీఆర్ తెలంగాణలో మరో భారీ పథకాన్ని ప్రవేశపెట్టారు. తెలంగాణలోని గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీని చేపట్టారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని సీఎం సొంత నియోజకవర్గంలో గొర్రెల పంపిణీని చేపట్టి ఒక్కో లబ్ధిదారుడికి 20 గొర్రెలు, ఒక పొట్టేలును అందించారు. ఇలా 825మందికి అందజేశారు. అనంతరం సభలో మాట్లాడారు.

తెలంగాణ గొల్లకుర్మలకు జీవితాలను బాగు పర్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్ప స్టెప్ తీసుకుందని.. నిరుపేద గొల్ల కుర్మలకు గొర్రెల యూనిట్లను అందజేస్తోందన్నారు. కానీ ఆ గొర్రెలకు (ప్రతిపక్షాలు) ఇది అర్థం కాదని వ్యాఖ్యానించారు. 2024 వరకు తెలంగాణ బడ్జెట్ 5లక్షల కోట్లకు చేరుతుందని .. రైతులకు కరెంట్, పెట్టుబడి, నీల్లు ప్రభుత్వమే ఉచితంగా అందజేస్తోందని.. ఎకరాలకు రూ.4వేల ఎరువులు పెట్టుబడిగా ఇస్తామని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు వరాలు కురిపించారు. ఇలా ప్రతిపక్షాలపై సూటిగా, సుత్తి లేకుండా కేసీఆర్ చేసిన విమర్శలు మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

To Top

Send this to a friend