కేసీఆర్ చిత్తశుద్ధి సరిపోలేదు..

సంకల్పం ఉంటే సరిపోదు.. దాన్ని సమర్ధవంతంగా అమలు చేసినప్పుడు అవినీతి ప్రక్షాళన జరుగుతుంది. పక్కరాష్ట్రం సీఎం చంద్రబాబు ఇలాంటి విషయాల్లోనే వేలు పెట్టడం లేదు. ఎందుకంటే అక్కడ అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అన్నిట్లో వేలు పెట్టి ఇరుక్కుపోయారనే ఆరోపణలున్నాయి. వారిని కదిలిస్తే తన ప్రభుత్వానికి మచ్చ వస్తుందని చంద్రబాబు చర్యలకు వెనుకాడుతున్నట్టు టీడీపీ నాయకులే ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.

కానీ కేసీఆర్ అలా కాదు.. ఆయన దగ్గర ఫైరవీలు నడవవు. కేసీఆర్ ను మేనేజ్ చేసే మొగాడు తెలంగాణలో లేడు. అందుకే రిజిస్ట్రేషన్ల శాఖలో ఒక ఊరినే రిజిస్ట్రేషన్ చేసి అవినీతి కట్టల పాము బయటపడితే కేసీఆర్ సీరియస్ గా స్పందించాడు. ఆ అక్రమార్కులైన రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను సస్పెండ్ చేసి వారిని అరెస్ట్ చేయించాడు. అంతేకాదు ఏసీబీ అధికారులను ఉసిగొల్పి అవినీతితో మకిలి పట్టిన రిజిస్ట్రేషన్ల శాఖపై దండయాత్ర చేపట్టాడు. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రస్తుతం బదిలీలు కొనసాగుతున్నాయి.

ఇంత చేసినా రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి పోలేదు. కేసీఆర్ చేసిన బదిలీలను కూడా అధికారులు అనువుగా మార్చుకున్నారు. ఏసీబీ కేసుల్లో ఇరుకున్న అవినీతి అధికారులను తమకు అనువైన చోట పోస్టింగ్ ఇప్పించుకున్నారు. కేసీఆర్ చేసిన అవినీతి ప్రక్షాళన ఇప్పుడు తెలంగాణలో ప్రహసనంగా మారింది. కేసీఆర్ కు ఎంత చిత్తశుద్ధి ఉన్నా కూడా ఆచరణలో అవినీతి అధికారుల వల్ల అదంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది.

To Top

Send this to a friend