ఏపీ రాజకీయాల్లో విజేతలెవరో కేసీఆర్ తేల్చేశాడు..

సమకాలీన రాజకీయ నేతల్లో ఉద్దండుడు కేసీఆర్. ఆయనలా రాజకీయ ఎత్తుగడలు వేయగల నాయకుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో లేరు. కేసీఆర్ రాజకీయ వ్యూహచతురతకు ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు కూడా బేజారై విజయవాడకు పయనమై.. తెలంగాణపై ఆశలు వదిలేశాడు.. ఇలా సామ, ధాన, బేధ దండోపాయాలు ప్రయోగించడంలో కేసీఆర్ ను మించిన నాయకుడు లేడనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ ఏపీ రాజకీయ నేతలతో పిచ్చాపాటిగా మాట్లాడారట.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరు గెలుస్తారనే దానిపై కేసీఆర్ తన మనసులోని మాటను బయటపెట్టాడట.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటాపోటీ తప్పదని వ్యాఖ్యానించినట్టు తెలిసింది.

ఏపీలో వచ్చే 2019 ఎన్నికల్లో పవన్ ప్రభావం ఉండకపోవచ్చని కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలిసింది. పార్టీని చిరంజీవి ఎలా నడిపాడో అందరికీ తెలిసిందేనని.. కాంగ్రెస్ లో విలీనం చేసి ప్రజారాజ్యం నాయకులను ముంచేశాడని అన్నారు. అందుకే పవన్ పై కూడా ఏపీ ప్రజల్లో అంత నమ్మకం లేదని స్పష్టం చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం తాజాగా ఓ ప్రముఖ సర్వే సంస్థ ఏపీలో చేసిన సర్వేలో వైసీపీకి 45శాతం ఓట్లు, టీడీపీకి 43శాతం, బీజేపీకి 2 శాతం, పవన్ కు 1.2 శాతం ఓట్లు వస్తాయని కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ లెక్కన వైసీపీ అధినేత జగన్ సీఎం అవుతారని.. కానీ 2019 వరకు ఈ వేడి కొనసాగిస్తేనే అని చెప్పినట్టు తెలిసింది. ఎందుకంటే వైసీపీకి, టీడీపీకి మధ్య కేవలం 2శాతం ఓట్ల తేడా మాత్రమే ఉండబోతోందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. జగన్ కానీ, చంద్రబాబు కానీ ఏ ఒక్క విషయంలో నిర్లక్ష్యం వహించినా వారికి అధికారం దక్కదని వ్యాఖ్యానించినట్టు తెలిసింది.

To Top

Send this to a friend