ప్రభాస్‌తో 150 కోట్ల డీల్‌లో నిజం ఉందా?

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌తో బాలీవుడ్‌ స్టార్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ 150 కోట్లతో డీల్‌ కుదుర్చుకున్నాడు అంటూ గత మూడు నాలుగు రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్త. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఈ వార్త గురించి తెగ సోషల్‌ మీడియాలో వెదుకుతున్నారు. కరణ్‌ జోహార్‌ చేయబోతున్న ప్రాజెక్ట్‌లు ఏంటి, ప్రభాస్‌ హిందీలో ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడు. ఇలాంటి ప్రశ్నలు ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు అందరిలో కూడా ఉత్పన్నం అవుతున్నాయి. అయితే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్‌తో కరణ్‌ 150 కోట్ల డీల్‌ అనేది ఒట్టి పుకారు మాత్రమే.

ప్రభాస్‌ ‘బాహుబలి’ సినిమాతో భారీ రేంజ్‌ను దక్కించుకున్నాడన్న మాట నిజమే, కాని బాలీవుడ్‌లో ప్రభాస్‌ మరో సినిమా చేస్తే ఆ స్థాయిలో ఆధరణ ఉంటుందా అనేది అనుమానమే. అలాంటప్పుడు ప్రభాస్‌తో రెండు సినిమాలకు గాను కరణ్‌ జోహార్‌ 150 కోట్లకు డీల్‌ కుదుర్చుకోవడం అనేది శుద్ద తప్పు. ప్రస్తుతం బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు కూడా 25 నుండి 50 కోట్ల పారితోషికం తీసుకుంటూ ఉంటారు. కాని ప్రభాస్‌ మాత్రం ఒక్కో సినిమాకు 75 కోట్లు ఎలా పుచ్చుకుంటాడు అనే విషయాన్ని ఏ ఒక్కరు కూడా గ్రహించడం లేదు.

తాజాగా కరణ్‌ జోహార్‌ ఇచ్చిన ఒక పార్టీలో ప్రభాస్‌ పాల్గొన్నాడు. అప్పటి నుండి కూడా ఈ పుకార్లు మరింతగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తున్న ‘సాహో’ చిత్రం మొత్తం బడ్జెట్‌ 150 కోట్లు. అలాంటిది ప్రభాస్‌కు 150 కోట్ల పారితోషికం అంటే ఎలా నమ్ముతున్నారో అర్థం కావడం లేదు. సోషల్‌ మీడియాలో వచ్చే ఇలాంటి వార్తలు ఫ్యాన్స్‌ను ఊహాలోకంలో ముంచెత్తుతున్నాయి. ఎవరో కావాలని ఇలాంటి వార్తను సోషల్‌ మీడియాలో పుట్టించడం ఆ తర్వాత చోద్యం చూడటం జరుగుతుంది.

To Top

Send this to a friend