చుండూరు ఆంధ్రాబ్యాంక్ లో కాపు లోన్స్ లో గోల్ మాల్

ఆంధ్రప్రదేశ్ లో కాపుల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి
నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం కాపు లోన్స్ మంజూరు
చేస్తున్నారు. అయితే ఆ లోన్స్ అర్హులైన లబ్దిదారులకు కాకుండా
దళారీలు నకిలీ వ్యక్తుల పేర్లు పెట్టి ఒకే యూనిట్ పై 2-3 లోన్స్
తీసుకుంటూ.. నిజమైన లబ్దిదారుల ఉపాధిని నాశనం చేస్తున్నారు. అసలైన లబ్దిదారులకు లోన్ సాంక్షన్ చేయడానికి
ముప్పుతిప్పలు పెడుతున్న బాంక్ మేనేజర్లు, నకిలీ వ్యక్తుల
ఫైల్ మాత్రం త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. దానికి గల కారణాలు మా ప్రతినిధి బృందం అన్వేషించగా తెలిసిన విషయం. ప్రతి లోన్ కి మేనేజర్ మరియు మీడియేటర్ కమిషన్ క్రింద 30% చార్జీ చేస్తునట్లు తెలిసింది. ఈ ప్రక్రియ చుండూరు మండలం చుండూరు గ్రామంలో ఉన్న ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ మరియు అదే గ్రామానికి చెందిన సీతయ్య అనే టీడీపీ కార్యకర్త తో కలిసి దండిగా లోన్స్ చేస్తూ జీతానికి మించిన ఆదాయం పొందుతున్నారని తెలిసింది.
అధికారులు తక్షణమే స్పందించి కాపు యువత ఉపాధి అవకాశాలను మింగేస్తున్న నేరస్తులను శిక్షించాలని కాపు యువత కోరుకుంటుంది.

To Top

Send this to a friend