ఫోన్ ఫ్రీగా.. జియో సంచలనం..

 

ముఖేష్ అంబానీ అన్నంత పనిచేశాడు. స్మార్ట్ ఫోనుంటేనే 4జీ సర్వీసులు పొందే వీలు ఇన్నాళ్లు ఉండేది. అందుకే ఈ కొరతను తీర్చేందుకు ఏకంగా జియో నుంచి 4జీ ఫీచర్ ఫోన్ ను ఈరోజు ఆవిష్కరించారు. జియో సర్వసభ్య సమావేశంలో ఈ ఫోన్ ను ఆవిష్కరించారు. వినియోగదారులందరికీ ఈ ఫోన్ ను ఫ్రీగా ఇస్తున్నట్టు ప్రకటించారు. టెలికాం మార్కెట్లోనే ఇదో సంచలనంగా మారింది. ఇండియా కా స్మార్ట్ ఫోన్.. జియోఫోన్ గా ముఖేష్ అంబానీ ఈ ఫోన్ ను అభివర్ణించారు. దేశంలోని 70కోట్ల మొబైల్ వినియోగదారుల్లో ఇప్పటికీ 50 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉన్నారన్నారు. వీళ్లందరికీ అత్యంత చౌక ధరలో స్మార్ట్ ఫోన్ అందించటంలో భాగంగా.. జియో ఫోన్ తీసుకొచ్చినట్లు ప్రకటించారు.

అంతేకాదు దేశంలోని వినియోగదారులందరికీ జియో ఫోన్ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అయితే ముందుగా రూ.1,500 డిపాజిట్ చేయాలి. మూడేళ్ల తర్వాత ఈ రూ.1500 తిరిగి ఇస్తారు. భారతీయులకు మాత్రమే ఇది ప్రత్యేకమని అన్నారు అంబానీ. ప్రస్తుతం జియో కస్టమర్లుగా ఉన్న వాళ్లందరికీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ఆగస్ట్ 15వ తేదీన ఫోన్ విడుదల అవుతుందని అంబానీ ప్రకటించారు.. ఆగస్ట్ 24వ తేదీ నుంచి బుకింగ్స్ స్టార్ట్ అవుతాయి. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఓపెన్ మార్కెట్ లోకి అందరికీ వస్తాయి.. ప్రతి వారం 50లక్షల ఫోన్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జియో ఫోన్లు ఫ్రీ ప్రకటనతో దేశంలోని ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేశారు. 1500 డిపాజిట్ కూడా తిరిగి ఇచ్చేస్తుండడంతో ఫోన్ మిగిలిపోయినట్టేనని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఆలోచనలకు అనుగుణంగా దేశాన్ని డిజిటలైజేషన్ చేసేందుకే ఈ ఫ్రీ ఫోన్ ను తీసుకొచ్చినట్టు ముఖేష్ అంబానీ ప్రకటించారు.

జియో ఫోన్ ఫీచర్స్ ఇవే :
-జియో ఫోన్ రూ.3,000 నుంచి రూ.4,500 మధ్య ఉంటుంది.
-జియో స్మార్ట్ ఫోన్ లో బేసిక్ ఇంటర్నెట్, వాయిస్ కాల్స్ ఉచితం
– ఫోన్ 2.4 అంగుళాల స్క్రీన్ ఉంటుంది.
-వాయిస్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. 22 భాషల్లో ఈ ఫోన్ సపోర్ట్ చేస్తోంది.
– హైటెక్ సెక్యూరిటీ ఫీచర్స్ తో ఇంత తక్కువ ధరలో మరో ఫోన్ లేదని తెలిపారు.
-వాయిస్ మేసేజ్ లు పంపించుకోవచ్చు. 4-way నావిగేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది.
– ఫోన్ లోని బటన్స్ లో ఐదవ అంకె ఎమర్జెన్సీ బటన్ గా పని చేస్తోంది. ఈ బటన్ నొక్కితే మీరున్న లోకేషన్ కూడా షేర్ అవుతుంది

To Top

Send this to a friend