జియో చీప్ ప్లాన్ రూ.153కే..

ఆగస్టు 24న జియో ఫీచర్ ఫోన్ తో పాటు ఓ అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించేందుకు జియో రెడీ అయినట్టు తెలిసింది.  ‘ఇండియా కా స్మార్ట్‌ఫోన్’గా  జియో చెప్పుకుంటున్న ఈ 4G VOLTE ఈ ఎంట్రీ-లెవల్ హ్యాండ్‌సెట్‌ ఆగస్టు 15 నుంచి బీటా టెస్టింగ్‌కు అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌ కోసం ప్రత్యేకమైన డేటా ప్రణాళికలను కంపెనీ వెల్లడించింది. వారానికి 50 లక్షల  ఫోన్లను విక్రయించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఆగస్టు 24 నుంచి ప్రీ బుకింగ్స్‌ (ఆన్‌లైన్‌ అండ్‌  ఆఫ్‌లైన్‌)  కానున్నాయి.

 ఈ ఫీచర్ ద్వారా రూ.24 నుంచి మొదలు పలు టారీఫ్ లపై రీచార్జ్ చేసుకునే వారికి అపరిమిత కాల్స్, డేటా సేవలు జియో అందించనున్నట్టు ప్రకటించింది. నెల రోజుల పాటు అపరిమిత డేటా, కాల్స్ కోసం కేవలం రూ.153 చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించడంతో వినియోగదారులు దీనికోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. 

ఇప్పటికే జియో ఉచిత సర్వీసుల వల్ల ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్, బీఎస్ఎన్ఎల్, ఎయిర్ సెల్, టెలినార్, రిలయన్స్ లు పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయాయి. టెలినార్, ఎయిర్ సెల్, రిలయన్స్ లు నష్టాలు తట్టుకోలేక మిగతా టెలికాం సంస్థలకు అమ్మడమో, విలీనం కావడానికో ప్రయత్నాలు చేస్తున్నాయి. టెలినార్ అయితే ఎయిర్ టెల్ కు అమ్ముడుపోయింది కూడా. ఇక ఐడియా, వోడాఫోన్ లు కూడా కలిసిపోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి.  మార్కెట్లో జియోకు పోటీ లేకుండా చేయడమే ఇప్పుడు ముఖేష్ అంబానీ ప్రథమ కర్తవ్యంగా కనిపిస్తోంది. అందుకోసమే ఆయన ఫ్రీ ఫోన్ తో పాటు ఉచిత డేలా, కాల్స్ , ఎస్.ఎం.ఎస్ సేవలు అందిస్తున్నారు. 

To Top

Send this to a friend