జనసేనాని పై  యుద్ధం మొదలైనట్టే..


సినిమాలు చూడట్లే.. పవన్ ఎవరో తెలియదు..: అశోక్ గజపతి..కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు.. జనసేన అధినేత హీరో పవన్ కళ్యాణ్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల టీడీపీపై, కేంద్రమంత్రులపై విరుచుకుపడుతున్న పవన్ ను తేలిగ్గా తీసేశారు.. పవన్ తాజా ట్వీట్ల విషయంలో మీ స్పందన ఏమిటని విలేకరులు అడగగా.. ఈ మేరకు స్పందించారు..

‘సినిమా నటుడు పవన్ అంటున్నారు.. నేను సినిమాలు చూసి చాలా కాలమైంది..’అని గజపతి రాజు వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ తరఫున ప్రచారం చేసి గెలిపించిన పవన్ ను ఉద్దేశించి కావాలనే అసహనంతో కేంద్రమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేవారు. పవన్ ఎవరో తెలియదని.. ఆయన ఏం మాట్లాడారో తెలియదని చెప్పారు. పవన్ సినిమా హీరోనేనని.. రాజకీయ నాయకుడు కాదంటూ పరోక్షంగా తేల్చిచెప్పినట్టైంది.

కాగా పవన్ విమర్శలపై అటు చంద్రబాబు కానీ, ఏపీ మంత్రులు కానీ ఇప్పటివరకు స్పందించలేదు. కేంద్ర మంత్రి అశోక్ గజపతి తొలిసారి స్పందించి పవన్ కు గట్టిషాక్ ఇచ్చారు. మున్ముందు ఇలానే మరింత మంది కూడా విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం ఉంది. సో జనసేనానిపై టీడీపీ యుద్ధం మొదలైనట్టే కనిపిస్తోంది.

To Top

Send this to a friend