మరో ప్రస్థానం దిశగా జనసేన..

తనని తాను పునరావిష్కరించుకొనున్న జనసేన,ప్రజా క్షేత్రంలో బలం చాటుకునేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్న జనసేనాని,పూర్తి స్థాయి కమిటీలతో రాజకీయ రణరంగంలోకి జనసేన,అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు,2019 ఎన్నికల్లో ఊహించని పరాజయం తరువాత పార్టీలో జవసత్వాలు నింపేందుకు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జనసేనాని తీవ్ర మేధోమధనం చేస్తున్నారు.175 సీట్లకి ఒక్క సీటు మాత్రమే గెలుచుకోవటం … సాక్షాత్తు తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలైన కూడా పార్టీ శ్రేణులు ఏ మాత్రం నిరుత్సాహనికి గురికాకపోవటం తనకి ఆశ్చర్యం కలిగిస్తుందని పైగా రెట్టించిన ఉత్సాహ0తో , మరింత కసితో తనకు , పార్టీకి అండగా నిలవడం తనకి శక్తినిస్తుందని తన సన్నిహితుల దగ్గర పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మహిళలు , యువత కులమతాలకు అతీతంగా తన వెంటే ఉన్నారని వారిలో ఓటమి ప్రభావం ఏ మాత్రం కనపడటం లేదని పవన్ అన్నట్టు తెలిసింది,అంతేకాకుండా పార్టీ ఓటమికి తీసుకున్న నిర్ణయాల్లోని చిన్న చిన్న లోపాలతో పాటు కోటరీపై వస్తున్న తీవ్ర విమర్శలపై కూడా పవన్ కూలంకషంగా చర్చించారనితెలిసింది.ఇదే క్రమంలో పార్టీని పూర్తి స్థాయిలో విస్తరించాలని వాటి ద్వారా పార్టీని ప్రజలకు మరింత చేరువచేసేందుకు కూడా పవన్ చకచకాపావులు కదుపుతున్నారు.

జాతీయ కమిటీ , రాష్ట్ర కమిటీ, జిల్లా , పార్లమెంట్ , నగర కమిటీలు మొదలుకొని మహిళ వింగ్ , యూత్ వింగ్ , కిసాన్ వింగ్ , స్టూడెంట్స్ వింగ్ , డాక్టర్లు, లాయర్లు , కార్మిక వింగ్ వరకు ప్రతీ కమిటీని సామాజిక న్యాయం ప్రకారం నిర్మించనున్నారు… ప్రతీ కమిటీకి ప్రత్యేక శిక్షణ ఇచ్చి అవసరమైన ప్రతీచోట ప్రజల పక్షాన పోరాడేందుకు పవన్ ప్రత్యేక ప్రణాళికలు వేస్తున్నారు,అయితే ఈ కమిటీలన్ని కూడా పార్టీ ఆవిర్భావం అప్పుడే నిర్మించదలచినా కొన్ని కారణాలతో అవి రూపంతరం చెందలేదు… ఈ కమిటీలకు సంబంధించిన ప్రణాళికలు మొత్తం ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులోని బల్లమీదే ఉండటం గమనార్హం,ఏది ఏమైనా జనసేన పార్టీ రానున్న రోజుల్లో మరింత బలోపేతం దిశగా … ప్రజల పక్షాన పోరాడే శక్తిగా రూపొందనుంది,విలువలు , సేవాదృక్పధం , హక్కుల సాధన , నిజాయితీ పరిపాలనా అనే పునాదులపై ఏర్పడి దేశం మొత్తం మీద జీరో బడ్జెట్ రాజకీయాలకు నిదర్శనం గా నిలిచిన జనసేన పార్టీలో నేనుకూడా ఒక కార్యకర్తని అయినందుకు ప్రతీక్షణం గర్విస్తూ …ఆళ్ల హరి

To Top

Send this to a friend