తెలంగాణలో జనసేన & వైకాపా ఓటు ఎవరికి ?

తెలంగాణలో జనసేన గాని వైకాపా గాని పోటీ చేసి ఉంటే సహజంగా తెలంగాణలో ఆయా పార్టీలకు ఓటు వేసే అవకాశం ఉండేది. అలా పడిన ఓట్లలో సీమాంధ్ర సెటిలర్ల కోట్లలో కోత ఏర్పడి తెదేపా కాంగ్రెస్ కూటమి ఓట్లు చీలి పోయేవి. ఈ రెండు పార్టీలు పోటీ చేయకుండా ఎటువంటి దిశా నిర్దేశం చేయకుండా మౌనంగా ఉండటం వలన ఆయా పార్టీల ఓటర్లకు స్వేచ్ఛను ఇచ్చారు. ఇటు జనసేన పార్టీ ఓటర్లు గాని అటు వైకాపా ఓటర్లు గాని తెలుగుదేశం పార్టీ కి గాని కాంగ్రెస్ పార్టీ కి గాని ఓటు వేసే అవకాశమే లేదు. ఇక ఆ పార్టీ ఓటర్లకు మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయం తెలంగాణ రాష్ట్ర సమితి. ఈ పరిణామం చేత చీలి పోవాల్సిన సెటిలర్స్ ఓట్లలో అత్యధిక శాతం తెలంగాణ రాష్ట్ర సమితికి పడే అవకాశం ఉన్నది.

సెటిలర్ల లో కులం కులం
తెలంగాణ రాష్ట్రంలో సెటిలర్ల లో అన్ని కులాల వారు ఉన్నారు. వీరిలో కాపు సామాజిక వర్గం ఓట్ల శాతం అత్యధికం ఆ పిదప బిసి ఎస్ సి ఎస్ టి మరియు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి.
కాపు రిజర్వేషన్ అంశంలో దారుణంగా మోసం చేసిన చంద్రబాబు నాయుడు కి సెటిలర్స్ లో ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లు పొరపాటున కూడా పడే అవకాశం లేదు. ఇక రెడ్డి మరియు ఎస్సీ సామాజిక వర్గం వైకాపాకి అనుకూలంగా ఉన్న కారణంగా ఆ వోట్లు సైతం తెలుగుదేశం పార్టీకి పడే అవకాశం లేదు. ఈ ఓట్లన్నీ గంపగుత్తగా తెరాస పార్టీ కి బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువ.
ఏతావాతా ఏ కోణంలో చూసినా తెలుగుదేశం పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న అనైతిక పొత్తు విఫలమై తెరాస పార్టీకి బలం చేకూర్చే విధంగా మారనున్నది. ఈ కూటమి ఓటమితో ఏపీలో తెలుగుదేశం పతనానికి సెటిలర్స్ నాంది పలుకుతారనేది వాస్తవం

To Top

Send this to a friend