మళ్లీ లీక్.. ఎన్టీఆర్ జైలవకుశ..

ఇంటర్నెట్ అరచేతిలోకి వచ్చేసింది. ఫోన్ తోనే అన్నీ కానిచ్చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం మనిషికి ఎంత మంచి చేస్తుందో అంతే చెడుచేస్తోంది. సినిమాలకు ఈ సాంకేతికత పెను శాపంగా మారింది. మొన్నటికి మొన్న అత్తారింటికి దారేది సినిమా సగం ముందే లీక్ అయ్యి డ్యామేజ్ జరిగింది. నేడు ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవకుశకు అదే పునారవృతమైంది. ఎన్టీఆర్ జైలవ కుశ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది.

మొదట జైలవకుశ తొలి టీజర్ విడుదలకు ముందు అది లీక్ అయ్యింది. జైలవకుశ ఎడిటింగ్ టీంలోని వ్యక్తి టీజర్ ను లీక్ చేశాడు. అతడిపై కేసుపెట్టి అరెస్ట్ కూడా చేయించారు. అంతేకాదు.. జూనియర్ సినిమాలోని ఫొటోలు, షూటింగ్ వీడియోలు కూడా లీక్ అయ్యాయి..

ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ జైలవ కుశ సినిమాకు సంబంధించిన మొదటి పాట లీక్ అవడం సంచలనం రేపుతోంది. సినిమా మొదలు కాగానే జై పాత్ర ఇంట్రడ్యూసింగ్ కు సంబంధించిన ఆ పాట ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఎన్ని గట్టి చర్యలు తీసుకున్నా కూడా ఇలా ఎన్టీఆర్ తాజా సినిమాకు లీకేజీల బాధ తప్పడం లేదట..

To Top

Send this to a friend