జగన్ ఆశలపై పవన్ నీళ్లు..

పవన్ కళ్యాణ్ ఏదో చెప్పాడు.. ఏదేదో చేస్తానన్నాడు.. చివరకు తుస్సు మన్నాడు. అధికార టీడీపీతోనే అంటకాగాడు.. చంద్రబాబును ఇటీవల పవన్ కళ్యాణ్ ఉద్దానం బాధితుల సమస్యలపై భేటి కావడం టీడీపీ నాయకులకు ఊరట కలిగించింది. జగన్ శిభిరంలో మాత్రం నిరుత్సాహాన్ని వారి ఆశలపై నీళ్లు చల్లింది.

గతంలో ఉద్దానం సహా ఏపీలోని సమస్యలపై చంద్రబాబుకు ఎదురు వెళుతానని.. ప్రతిపక్షంతో కలిసి పోరాడుతానని పవన్ ప్రకటించడంతో తనతో కలిసివస్తాడని జగన్ భావించాడు. సంవత్సరకాలం నుంచి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని దుయ్యబడుతున్న పవన్ .. తెలుగు దేశం పార్టీకి కూడా దూరమయ్యాడని భావించారు. కానీ తాజాగా పవన్ -చంద్రబాబు భేటి ఆ ఊహాగానాలకు తెరదించింది.

భవిష్యత్ ఏపీ రాజకీయ చిత్రంలో పవన్ తో కలిసి 2019 ఎన్నికల్లో పోటీచేయాలనుకున్న జగన్ ఆశలపై పవన్ నీళ్లు చల్లాడనే చెప్పవచ్చు.. ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు పవన్ తో పాటు మహాకూటమి ఏర్పాటు చేయాలనుకున్న జగన్ కు పవన్ .. టీడీపీకి సపోర్టుగా చంద్రబాబుతో భేటి కావడం నిరాశను కలిగించింది. అంతేకాదు.. వచ్చే నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా జనసేన సపోర్టు టీడీపీకే ఉంటుందనే ఊహాగానాలను పవన్ ఈ భేటి ద్వారా శ్రేణులకు అందించారు. ఇలా జగన్ కు దూరంగా.. చంద్రబాబుకు దగ్గరగా జరిగి పవన్ తన సపోర్టు వైసీపీకి ఉండదని నర్మగర్భంగా స్పష్టమైన సంకేతాలిచ్చేశాడు..

To Top

Send this to a friend