వైసీపీ నుంచి జగన్ ఔట్.. రోజా అధ్యక్షురాలు..?

నంద్యాల ఉప ఎన్నికల్లో నువ్వానేనా అన్నట్టు తలపడ్డ అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల్లో ప్రజల తీర్పు ఎవరికనేది తేటతెల్లం అవుతోంది. ఈరోజు నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రతి రౌండుకు కనీసం 1500 నుంచి 3000 వరకు టీడీపీకి ఆదిక్యం లభిస్తోంది. టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందారెడ్డి.. ప్రతిపక్ష వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి ఆదిక్యం కనబరుస్తూ గెలుపు ఖాయం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఓ రహస్య ప్రాంతంలో ఉన్న ఫాంహౌస్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో వైకాపా ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు భేటీ అయినట్టు సమాచారం. ఈ సందర్భంగా వైసీపీపై, జగన్ గురించి కొన్ని తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు సమాచారం.

ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ జగన్ మాట తీరు వల్లే నష్ట పోయామని వ్యాక్యానించినట్టు తెలిసింది. ఇదే వ్యవహారశైలి కొనసాగితే మన భవిష్యత్తు అంధకరమే అంటూ భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించినట్టు సమాచారం. ఎన్నో వందల కోట్లు తెచ్చి ఢిల్లీ నుంచి తెచ్చిన రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కూడా ఫెయిల్ అయినట్టు చర్చించినట్టు తెలిసింది.ఇక ఈ భేటిలో జగన్ స్థానంలో నూతన అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ సంతకాల సేకరణ చేపడుతున్న రోజా ఇప్పటివరకూ 20 మంది సంతకాలు రోజా సేకరించినట్టు సమాచారం.

రహస్యంగా క్యాంపు నిర్వహించి ఎలక్షన్ కమిషన్ కు లేఖ సమర్పించడానికి రంగం సిద్ధం చేస్తున్న రోజా పార్టీని కాపాడుకోవడానికి ఈ చర్య చేపడుతున్నట్టు వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఈ మేరకు రోజా వర్గంలోని ఎమ్మెల్యేలతో లాబీయింగ్ మొదలు పెట్టినట్టు తెలిసింది. వైవి సుబ్బారెడ్డితో రోజా ఫోన్లో మంతనాలు జరిపినట్టు తెలిసింది. దీంతో వైసీపీలో తీవ్ర సంక్షోభం దిశగా పరిణామాలు చోటుచేసుకుంటున్నట్టే తెలుస్తోంది.

To Top

Send this to a friend