విమర్శలకు జడిసి.. ఏపీకి జగన్ మకాం..

హైదరాబాద్ లో ఉంటూ ఏపీలో రాజకీయాలు చేస్తావా’ అని విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలకు ఇక ఆ చాన్స్ ఇవ్వకూడదని జగన్ డిసైడ్ అయ్యారు. రాజకీయ వ్యూహకర్త సూచనల మేరకు ఇప్పటికే 9 పథకాలు, పాదయాత్ర డేట్ ను ప్రకటించిన జగన్.. ఇప్పుడు ఏపీ ప్రజలకు మరింత చేరువగా ఉండాలని తన మకాంను రాజధాని అమరవతికి మార్చుతున్నాడు. ఈ మేరకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.

ఏపీలో వైసీపీ కార్యాలయాన్ని విజయవాడ లేదా గుంటూరులో ఏర్పాటు చేయాలని వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచించిన నేపథ్యంలో జగన్ స్థలాన్ని వెతికే పనిలో పడ్డారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ ముఖ్య నేతలు విజయవాడ, తాడేపల్లి ప్రాంతాల్లో ఖాళీ స్థలాలపై ఆరా తీస్తున్నారు. చివరకు బందర్ రోడ్డులోని స్వరాజ్ మైదాన్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని వైసీపీ కార్యాలయం, జగన్ నివాసం కోసం నేతలు ఫైనల్ చేసినట్టు సమాచారం..

వచ్చే ఆగస్టులో అక్కడ నిర్మాణం పూర్తి జగన్ పెట్టా బేడా సర్దుకొని హైదరాబాద్ విడిచి అమరావతి రావడానికి ఏర్పాట్టు చేసుకుంటున్నట్టు తెలిసింది. ఇక నుంచి జగన్ అమరావతిలోనే ఉంటూ 2109 ఎన్నికలను ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

To Top

Send this to a friend