జగన్ కు ఉపశమనం


అప్పట్లో ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను ఫిరాయింపచేశారు. కొద్దిరోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యేలకు టీడీపీ మంత్రివర్గంలో మంత్రి పదవులు ఇచ్చారు. దీంతో ఇది అనైతికమని ప్రతిపక్ష వైసీపీ నేత జగన్ గవర్నర్ నరసింహన్ ను మొదలు పెట్టి ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి.. జాతీయ పార్టీల నేతలందరినీ కలిసి విన్నవించారు. కానీ అప్పుడు ఎంత ప్రయత్నించినా ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.

కానీ మంగళవారం రాత్రి అనూహ్యం జరిగింది. ప్రధాని కార్యాలయం నుంచి వైఎస్ జగన్ కు ఫోన్ వచ్చింది. బుధవారం ప్రధాని అపాయింట్ మెంట్ ఖరారైందని చెప్పారు. దీంతో ఉదయాన్నే ఢిల్లీ వెళ్లిన జగన్ దాదాపు 45 నిమిషాల సేపు ప్రధాని నరేంద్రమోడీతో రహస్య సమావేశాలు జరిపారు.

బయటకు వచ్చిన తర్వాత రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ జరిగిందని.. తాము బీజేపీ అభ్యర్థికే మద్దతిస్తామని ప్రకటించారు. కానీ తెరవెనుక పెద్ద తతంగమే జరిగిందని సమాచారం. జగన్, వైసీపీ ఎంపీలు ప్రధాని మోడీతో ప్రధానంగా జగన్ సీబీఐ కేసుల పైన, ఏపీలో రాజకీయ పరిస్థితులపైన చర్చించారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో గనుక జగన్ గెలిస్తే.. వైసీపీ పార్టీని బీజేపీలో విలీనం చేసేలా ఒప్పందం కుదిరినట్టు సమాచారం. దీనికి ప్రతిగా జగన్ పై ఉన్న సీబీఐ కేసులను కేంద్రం నీరుగార్చేలా అవగాహన కుదిరినట్టు సమాచారం. ఇలా ఒకే దెబ్బకు మోడీకి ఏపీలో అధికారం.. జగన్ కు ఉపశమనం లభించేలా చర్చలు జరిగినట్టు సమాచారం.

To Top

Send this to a friend