ఇక జబర్దస్త్‌కు మంగళం


అయిదు సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్న జబర్దస్త్‌ కార్యక్రమం ఆగిపోనుందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ఒకటి లేదా రెండు నెలల్లో ‘జబర్దస్త్‌’ కార్యక్రమంకు మంగళం పాడేయాలనే ఉద్దేశ్యంతో ప్రొడక్షన్‌ సంస్థ ఉన్నట్లుగా తెలుస్తోంది. జబర్దస్త్‌ కార్యక్రమంపై విమర్శలు తారా స్థాయిలో వస్తుండటంతో పాటు, ఈటీవీ యాజమాన్యం కూడా ఈ కార్యక్రమంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. పైగా ఈ కార్యక్రమంలో జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్న నాగబాబు మరియు రోజాలు తప్పుకోవాలని భావిస్తున్నారు.

ప్రారంభం అయినప్పటి నుండి కూడా రోజా మరియు నాగబాబులు ఇద్దరు కూడా జడ్జ్‌లుగా కార్యక్రమం స్థాయిని పెంచుతూ వచ్చారు. కార్యక్రమంలో ఎంతో మంది కమెడియన్స్‌ వచ్చారు, పోయారు. కాని యాంకర్స్‌ మరియు జడ్జ్‌లు మాత్రం అలాగే ఉన్నారు. తీవ్రమైన కామెంట్స్‌ వస్తున్న నేపథ్యంలో చాలా రోజులుగా నాగబాబు జబర్దస్త్‌కు దూరం అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. ఎట్టకేలకు నాగబాబు ఈ కామెడీ షోకు గుడ్‌ బై చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్ల మూడు నెలల పాటు విదేశాలకు నాగబాబు వెళ్లేందుకు సిద్దం అయ్యాడు.

నాగబాబు లేకుండా కొన్ని ఎపిసోడ్‌లు ఇప్పటి వరకు జరిగాయి. కాని మూడు నెలలు నాగబాబు లేకుండా నడపడం అంటే కాస్త కష్టమే. దానికి తోడు రోజా కూడా ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో జబర్దస్త్‌కు దూరం అవ్వాలని నిర్ణయించుకుంది. పార్టీ నుండి కూడా రోజాపై ఒత్తిడి వస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరు లేని జబర్దస్త్‌ కార్యక్రమం ఊహించుకోవడం సాధ్యం కాదు. అందుకే జబర్దస్త్‌కు మల్లెమాల ప్రొడక్షన్స్‌ వారు మంగళం పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.

To Top

Send this to a friend