జబర్ధస్త్ x బిగ్ బాస్, ఏదీ టాప్..

కామెడీని ఇంటిల్లిపాదికి పంచే జబర్ధస్త్.. ఇక సెలబ్రెటీల స్థితిగతులు వివరించే బిగ్ బాస్.. ఈటీవీ, మాటీవీల్లో వస్తున్న ఈ రెండు ప్రోగ్రాంలలో ఏది హిట్.. ఏదీ మొదటి ర్యాంక్.. ప్రేక్షకుల ఓటు ఎవరికీ.. దేనికి ఎంత రేటింగో తెలుసుకుందాం.

మాటీవీ చేతులు మారి స్టార్ యాజమాన్యం చేతుల్లోకి వెళ్లింది. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం చిరంజీవి హోస్ట్ గా అస్సలు ప్రేక్షకాదరణ పొందలేదు. దీంతో బాలీవుడ్ లోని ప్రోగ్రాం అయిన బిగ్ బాస్ ను తెలుగులోకి తీసుకొచ్చింది స్టార్ మాటీవీ. ఎన్టీఆర్ ను వ్యాఖ్యాత గా పెట్టింది. దీంతో షో ఎక్కడికో వెళ్లిపోయింది. బిగ్ బాస్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలుగు టీవీ చరిత్రలోనే ఎవ్వరికీ రాని 16.5 రేటింగ్ బిగ్ బాస్ సాధించింది.

టాలీవుడ్ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి ట్రాక్ రికార్డ్ గతంలో ఏమీ బాగాలేదు.. 1987 నుంచి శ్యాం ప్రసాద్ రెడ్డి మల్లెమాల ప్రొడక్షన్ పేరుతో తలంబ్రాలు.. అభిరుచి, అంకుశం, ఆగ్రహం, అమ్మోరు.. అంజి, ఇలా కొన్ని సినిమాలు హిట్.. కొన్ని ప్లాపులతో సినిమాలకు నెట్టుకొస్తున్నారు. చివరగా తీసిన అరుంధతి గ్రాండ్ హిట్ అయ్యింది..ఇక సినిమాలనే వదిలేద్దామనుకున్న టైంలో శ్యాంప్రసాద్ రెడ్డి చేతిలో ఈటీవీని పెట్టారు రామోజీరావు.. ఆ ప్రయత్నం సక్సెస్ అయ్యింది. మల్లెమాల ప్రొడక్షన్ పేరుతో శ్యాంప్రసాద్ రెడ్డి ఈటీవీలో ప్రారంభించిన జబర్ధస్త్ గ్రాండ్ హిట్ అయ్యింది. ప్రతి గురు, శుక్రవారాలు వస్తున్న ఈ షోను చూడడానికి అందరూ 9.30కి ఇంటిపట్టున ఉంటారంటే కామెడీ టైమింగ్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు జబర్దస్త్ తోనే ఈటీవీ టాప్ రేటింగ్ కు వచ్చింది. ఆ తర్వాత ఈటీవీ ప్లస్ తో పటాస్ ప్రోగ్రాంతో మరోసారి ఆ చానల్ ను నిలబెట్టారు మల్లెమాల అధినేత…

ఇప్పుడు బిగ్ బాస్ దెబ్బకు జబర్ధస్త్ కుదేలయ్యింది. ఇప్పటివరకు 7.5 రేటింగ్ తో జబర్ధస్త్ ఫస్ట్ ప్లేసులో ఉండేది. కానీ దానికి రెట్టింపు స్థాయిలో బిగ్ బాస్ హిట్ అయ్యింది.. అందులో ఓవర్ , రోమాంటిక్, సెక్స్ కామెడీని ప్రేక్షకులు నిరాకరిస్తున్నారు. ఒక్క ఆది స్కిట్ లు తప్ప ఏ జోక్ పేలడం లేదు. కానీ బిగ్ బాస్ లో 14 మంది సెలబ్రెటీలు చేసే పనులకు జనం ఫిదా అవుతున్నారు. దీంతో తెలుగు టీవీ చానల్స్ లో జబర్ధస్త్ ను తొక్కేసి ప్రస్తుతం బిగ్ బాస్ షో తో మాటీవీ ఎక్కడికో వెళ్లిపోయింది. బిగ్ బాస్ ను ఆదరిస్తున్నారు.

To Top

Send this to a friend