అర్జున్ రెడ్డి ఫ్రెండ్ గురించి ఆసక్తికర కథనం..

విజయ్ గత ఏడాది నటించిన ‘పెళ్లిచూపులు’ సినిమాలో ప్రియదర్శి ఎలా అయితే తెలంగాణ స్లాంగ్‌తో సరికొత్త వినోదం పంచాడో.. ‘అర్జున్ రెడ్డి’లో శివ పాత్రలో రాహుల్ రామకృష్ణ కూడా అలాగే ఎంటర్టైన్ చేశాడు. చెప్పాలంటే ప్రియదర్శి కంటే కూడా రాహుల్ ఎక్కువ ఇంపాక్ట్ చూపించాడు. మూవీలో కీలకమైన పాత్రను చాలా బాగా చేశారు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ తర్వాత ఎక్కువగా ఆకట్టుకున్న నటుడు హీరో ఫ్రెండుగా నటించిన రాహుల్ రామకృష్ణనే.

తెలంగాణ యాసను పర్ఫెక్ట‌ుగా పలుకుతూ.. ప్రేక్షకుల్ని భలే ఎంటర్టైన్ చేశాడు రాహుల్. హీరోకి ఎలాంటి పరిస్థితి వచ్చిన తోడుగా ఉంటూ.. నిజమైన ప్రెండ్ అంటే ఇలానే ఉండేలా నటించాడు. దాంతో ఆ పాత్రకు చాలా మంది ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు.‘పెళ్లిచూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ రూపొందించిన ‘సైన్మా’ అనే షార్ట్‌ ఫిలింలో రాహులే ప్రధాన పాత్రధారి. ఆ షార్ట్ ఫిల్మ్ తో రాహుల్ కు మంచి పేరొచ్చింది. పెళ్లి చూపులు ఫేం కమెడియన్ ప్రియదర్శి లానే రాహుల్ కూడా సినిమాల్లో చాలా బిజీ అయ్యే ఛాన్సులు చాలానే ఉన్నాయి.

To Top

Send this to a friend