జియో ఫోన్ గురించి మరో గుడ్ న్యూస్

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియాలోనే చవకైన 4జీ స్మార్ట్ ఫోన్ జియో 4జీ ఫోన్ లాంచ్ కు వేళయ్యింది. కేవలం 1500 డిపాజిట్ చేస్తే ఉచితంగా ఫోన్ అందిస్తారు. ఆగస్టు 24 నుంచి ప్రీ బుకింగ్స్‌ (ఆన్‌లైన్‌ అండ్‌ ఆఫ్‌లైన్‌) కానున్నాయి. జియో ఫోన్ ఎంత మంది కావాలనుకుంటున్నారు.. అనే విషయాన్ని అంచనా వేయటం కోసం రిజిస్ట్రేషన్ ఇన్ ట్రస్ట్ ఓపెన్ చేసింది జియో. ఫస్ట్‌ కం ఫస్ట్‌ సెర్వ్‌ కింద సెప్టెంబరు ఒకటి నుంచి ఫోన్ల డెలివరీ ఉంటుంది.

ఇందుకోసం సోమవారం నుంచే (ఆగస్టు -14) నుంచే రిజిస్ట్రేషన్ ప్రారంభించింది జియో. JIO.COM వెబ్ సైట్ లో పేరు, మొబైల్ నెం, పిన్ కోడ్ వివరాలను అందిస్తే చాలు స్పాట్ లో మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ అవుతుంది. ఇందుకు సంబంధించిన OTP కూడా వస్తుంది. ‘ఇండియా కా స్మార్ట్‌ఫోన్’గా జియో చెప్పుకుంటున్న ఈ 4G VOLTE ఈ ఎంట్రీ-లెవల్ హ్యాండ్‌సెట్‌ ఆగస్టు 15 నుంచి బీటా టెస్టింగ్‌కు అందుబాటులోకి రానుంది.

ఈ ఫోన్‌ కోసం ప్రత్యేకమైన డేటా ప్రణాళికలను కంపెనీ వెల్లడించింది. వారానికి 50 లక్షల ఫోన్లను విక్రయించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. జియో ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత గానీ ఈ ప్రభావాన్ని అంచనా వేయలేమని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఫోన్ ఉచితమని ప్రకటించారు. సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ.1500 డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. మూడు సంవత్సరాల తర్వాత రిఫండ్‌ చేయనుంది కంపెనీ.

To Top

Send this to a friend