చైనాకు షాక్ ఇచ్చిన భారత్..

చైనా దేశం భారత సరిహద్దుల్లోని డోక్లాంలో దురాక్రమణకు దిగడంతో ఆ దేశానికి షాక్ ఇచ్చేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. చైనా మొబైల్ తయారీ కంపెనీలకు నిన్న నోటీసుల పేరుతో జలక్ ఇచ్చింది. చైనా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే ఈ నోటీసులు ఇచ్చినట్టు సమాచారం.

చైనా దిగ్గజ మొబైల్ కంపెనీలైన షియోమీ, వివో, ఒప్పో, జియోనీల ఫోన్ల నుంచి ఆ రహస్య సమాచారం సదురు కంపెనీకి వెళ్లిపోతోందట. చైనా తయారీ ఫోన్లలోనిసమాచారాన్ని దొంగలిస్తున్నారనే సమాచారం భారత ప్రభుత్వానికి వెళ్లడంతో వాటిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం చైనా మొబైల్ కంపెనీలకు షాక్ ఇచ్చింది. భారత ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫరేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ దిగ్గజ మొబైల్ కంపెనీలైన షియోమీ, వివో, ఒప్పో, జియోనీలతో పాటు అమెరికన్ కంపెనీ యాపిల్ కు నోటీసులు జారీ చేసింది.

ఈ చైనా కంపెనీలు వినియోగదారుల సమాచారాన్ని కొల్లగొడుతున్నాయని తేలిన మేరకు కేంద్రం ఈ చర్యలకు ఉప క్రమించింది. చైనా మొబైళ్లు కొన్న వినియోగదారుల ఫోన్లోని రహస్య సమాచారాన్ని ఫోన్లోని కాంటాక్ట్ లిస్ట్, మెయిల్స్, మేసేజ్ లను దొంగచాటుగా తీస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్రం సదురు చైనా మొబైల్ కంపెనీలకు నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 28లోపు సమాధాన ఇవ్వాలని సదురు చైనా కంపెనీలకు నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 28లోపు సమాధాన ఇవ్వాలని సదురు చైనా కంపెనీలకు నోటీసుల్లో కేంద్రం పేర్కొంది. ఆ లోగా వినియోగదారులకు భద్రతకు తీసుకుంటున్న చర్యలు వెల్లడించాలి. చోరీ చేస్తారని తెలిస్తే ఆ సంస్థల అమ్మకాలను కేంద్రం భారత్ లో నిషేధించేందుకు రెడీ అయినట్టు సమాచారం.

అయితే సరిహద్దుల్లో చైనా ఆగడాలకు చెక్ పెట్టేందుకే భారత ప్రభుత్వం చైనా కంపెనీలకు నోటీసులు జారీ చేసినట్లు గుసగుసలు వినపడుతున్నాయి. చైనా కంపెనీలను దెబ్బతీస్తే చైనా వెనకడుగు వేస్తుందనే ఇలా చేస్తున్నట్టు సమాచారం.

To Top

Send this to a friend