మళ్లీ భారత్-పాకిస్తాన్ యుద్ధం.?


అవును.. మళ్లీ భారత్ పాకిస్తాన్ యుద్ధం చూడబోతున్నాం.. కానీ అది బార్డర్ లో కాదు.. మైదానంలో .. చాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లోనే భారత్, పాకిస్తాన్ తో తలపడి ఆ జట్టును చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే.. ఇక పాక్ ఆ తర్వాత సౌతాఫ్రికాను, శ్రీలంకను ఓడించి సెమీస్ చేరింది. సెమీస్ లో ఆతిథ్య ఇంగ్లండ్ తో తలపడబోతోంది.

ఇక ఇండియా శ్రీలంక చేతిలో దారుణంగా ఓడి పాకిస్తాన్, సౌతాఫ్రికాలపై నెగ్గి సెమీస్ చేరింది. సెమీస్ లో గ్రూప్ ఏ లో రెండో స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్ తో ఇండియా పోటీపడనుంది. ఇందులో ఇండియా గెలవడం లాంచనమేనని స్పోర్ట్స్ ఎనలిస్టులు చెబుతున్నారు. మరో సెమీస్ లో ఇంగ్లండ్, పాకిస్తాన్ లలో ఎవరు గెలుస్తారో చెప్పలేమని.. కానీ పాకిస్తాన్ గెలిస్తే మరోసారి ఇండియా పాకిస్తాన్ ఫైనల్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించడం ఖాయమనే అంచనాలు పెరిగిపోతున్నాయి..

కాగా సెమీస్ పోరు ఆసక్తి రేపుతోంది. బంగ్లాదేశ్ ను ఇండియా తక్కువ అంచనావేయడానికి లేదు. ఇక ఇంగ్లండ్, పాకిస్తాన్ లో గెలుపు ఎవరిది అనేది చెప్పడం కష్టం.. అంతా అనుకున్నట్టు జరిగి అటు పాక్ , ఇటు ఇండియా సెమీస్ లో గెలిస్తే మరో సారి క్రికెట్ అభిమానులు భారత్ పాక్ యుద్ధాన్ని టీవీల్లో చూడవచ్చు.

To Top

Send this to a friend