చైనాకు చురుకు.. విజేందర్ దేశభక్తి అదుర్స్

భారత్-చైనా మధ్య భూటాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూభాగం కోసం సాగుతున్న ఈ లొల్లి ఇరు దేశాల మధ్య లొల్లికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ఇండియన్ బాక్సర్ విజేందర్ .. చైనా బాక్సర్ ను చిత్తుగా ఓడించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. నిన్ననే ముంబైలో జరిగిన బ్యాటిల్ గ్రౌండ్ ఏషియా బాక్సింగ్ పోటీలో చైనా బాక్సర్ జుల్ఫికర్ మైమైటియాలిపై నెగ్గి టైటిల్ సాధించిన భారత చాంపియన్ బాక్సర్ విజయేందర్ సింగ్.. తాజాగా తన టైటిల్ ను వదులుకోవడానికి సిద్దం అని ప్రకటించించాడు. భారత్ డోక్లాం సరిహద్దులో ప్రశాంతత నెలకొనాలని ఆశిస్తున్నట్టు తెలిపాడు. ప్రస్తుతం చైనా-భారత్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న సందర్భంగా తన టైటిల్ ను చైనా బాక్సర్ ఇచ్చి అయినా శాంతి కావాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు.

సహజంగానే ముందునుండే విజయేందర్ సింగ్ లో దేశభక్తి కాస్త ఎక్కువ. అతను ఆడే ఆటలోనూ దేశభక్తి కనిపిస్తుంది. ఎంతో కసితో యుద్ధ రంగంలో ఎంతటి హోరాహోరీ పోరైనా పటిష్టంగా ఆడతాడు. అందుకే ఒలింపిక్స్ లో పతకం సాధించి భారత్ పతాకం రెపరెపలాడించాడు. నిన్నటి ఆటతో సహా తొమ్మిదిసార్లు ఇప్పటికే విజయేందర్ చాంపియన్ గా నిలిచాడు. చాంపియన్ గా పేరున్న చైనా బాక్సర్ జుల్ఫికర్ మైమైటియాలిని నిన్న చిత్తుగా ఓడించి ప్రపంచాన్ని ఆకర్షించాడు. సాధారణ కుటుంబం నుండి వచ్చిన విజయేందర్ సింగ్ కష్టపడి చాంపియన్ స్థాయికొచ్చాడు. ఇప్పుడు దేశం కోసం ఓ సైనికుడిలా ఓ నాయకుడిలా ఆలోచించి టైటిల్ నే తిరస్కరిస్తా అని యావత్ దేశప్రజల దృష్టిలో హీరో అయ్యాడు.

మరి అంత పెద్ద టైటిల్ ను తిరస్కరించడం అంటే సాధారణ విషయం కాదు.. టైటిల్ ను వదులుకుంటా అని చెప్పిన విజయేందర్ సింగ్ అవసరమైతే టైటిల్ ను ఓడిపోయిన చైనా బాక్సర్ జుల్ఫికర్ కు ఇవ్వడానికైనా సిద్ధం అన్నాడు. ఇరు దేశాల మధ్య శాంతి అవసరం అన్నాడు. ఈ సందేహం చైనా మీడియాకు, చైనీయులకు చేరుతుందంటూ వాళ్లు మారాలని కోరారు.

To Top

Send this to a friend