అనుష్కను సెక్సీగా చూడటం అసాధ్యం

‘రుద్రమదేవి’, ‘బాహుబలి’, ‘సైజ్‌జీరో’ ఇప్పుడు ‘భాగమతి’ ఇలా విభిన్న పాత్రల్లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుష్క ప్రస్తుతం గ్లామర్‌ రోల్స్‌ కోసం ఎదురు చూస్తుంది. మునుపటి తరహాలోనే హీరోలతో రొమాన్స్‌ చేసేందుకు సిద్దం అంటుంది. అయితే అనుష్కతో రొమాన్స్‌ చేసేందుకు ఇప్పుడే ఏ హీరో కూడా ఆసక్తిగా లేడని చెప్పుకోవచ్చు. ఈమె రొమాన్స్‌ చేసినా కూడా ప్రేక్షకులు చూడాలనే ఆసక్తితో లేరు.

అనుష్క వరుసగా హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాల జాబితాలో నటించడం వల్ల గ్లామర్‌ పాత్రలో ఆమెను చూడటం సాధ్యం అయ్యే పని కాదు. ఇటీవల సింగం 3 లో నటించిన అనుష్క అసహ్యంగా కనిపించిందనే టాక్‌ ఉంది. ఆ సినిమాలో ఇలా వచ్చి అలా వెళ్లినా కూడా అనుష్క గ్లామర్‌ రోల్‌లో ఏమాత్రం ఆకట్టుకోలేదనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఎంత అందంగా, ఎంత మంచి పాత్రలో గ్లామర్‌గా నటించినా కూడా ఆడియన్స్‌ అందుకు ఒప్పుకోరు అని, ఆమెను గ్లామర్‌గా చూడటం ప్రేక్షకుల వల్ల కాదని అంటున్నారు.

ఇకపై అనుష్క పద్దతైన పాత్రల్లో లేదా హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాల్లో నటిస్తే తప్ప టాలీవుడ్‌ లేదా కోలీవుడ్‌లో స్థానం లేదని అంటున్నారు. గ్లామర్‌ పాత్రల్లో ఒకవేళ నటించినా కూడా తిరష్కరణకు గురి అవ్వాల్సి వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పర్సనాలిటీతో గ్లామర్‌ పాత్ర చేస్తే అభినందించాల్సిన ప్రేక్షకులు విమర్శలు గుప్పిస్తారని విశ్లేషకులు అంటున్నారు. అయినా కూడా అనుష్క అదే పనిగా గ్లామర్‌ రోల్‌ను చేయాలని భావిస్తుందా అనేది చూడాలి.

To Top

Send this to a friend