రాధాకృష్ణ ముందే చెప్పుతో కొడతానంది..

ఆయన ఫేమస్ జర్నలిస్టు కం ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ.. ఆయన ముందు తెలుగులో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుతో కొడతానని సంచలన వ్యాఖ్య చేసింది. ఇంతకీ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుతో కొడతానని ఎవరిని అంది.. ఆ కథ ఏమిటనేది చాలా ఇంట్రస్టింగ్ గా మారింది.. దాదాపు టాలీవుడ్ లో అందరు హీరోలతో చేస్తూ మాస్త్ బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ చేసిన వ్యాఖ్య ఇండస్ట్రీని ఊపేస్తోంది. ప్రస్తుతం మహేశ్ బాబుతో కలిసి స్పైడర్ సినిమాలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో పలు సంచలన విషయాలను బయటపెట్టింది.

ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ చెప్పిన మాటలు సంచలనమయ్యాయి. తాను ఎట్టిపరిస్థితుల్లో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోనని.. ప్రేమ పెళ్లి మాత్రమే చేసుకుంటానని రకుల్ బదులిచ్చింది. తనను పెళ్లి చేసుకోబోయే వాడి కోసం చూస్తున్నానని.. అతడికి సినిమాలపై ఫ్యాషన్, నాపై బోలెడంత ప్రేమ, ముఖ్యంగా నాలా బోజన ప్రియుడు అయ్యి ఉండాలని స్పష్టం చేసింది. ఇక నేనే చేసే పనులకు ఎప్పుడూ అడ్డురావద్దని.. అది చేయి ఇది చేయి అని అంటే ‘చెప్పుతో కొడతానంటూ’ శివాలెత్తిపోయింది. ఒక మీడియా పెద్ద ముందు చెప్పుతో కాబోయే భర్తను అతిచేస్తే కొడతానని అనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. రకుల్ చెప్పిన ఎన్నో సంచలన విషయాలు కాంట్రవర్సీకి దారితీశాయి.

రకుల్ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో పురుషుల ఆధిక్యం నడుస్తోందని..అందులో అడ్జస్ట్ అయిపోవాల్సిందేనని రకుల్ స్పష్టం చేసింది. తాను మందు, సిగరెట్ తాగనని.. కానీ ఓ సారి సిగరెట్ రుచి చూశానని చెప్పింది. డ్రగ్స్ కేసులో మీడియా అతిచేస్తోందని.. ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో రాయకుండా ఫలానా హీరోలను, హీరోయిన్లను టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్టో చెప్పాలని వాపోయింది.

To Top

Send this to a friend