పైల్స్(మొలలు)తో బాధపడుతున్నారా?

బాగా కోపం తెచ్చుకునే వారిని చూసి సాధారణంగా అడిగే ప్రశ్న ఏంటీ నీకు పైల్స్ ఉన్నాయా అంటాం! పైల్స్ అనగానే గుర్తొచ్చేది బాత్రూము, అక్కడ పదే బాధలు.అవును ఇది నిజమే. పొద్దున్నే మలవిసర్జనకు బాత్రూముకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది.ఎందుకంటే వారికి పైల్స్(మొలలు) ఉన్నాయని అర్థం. మారుతున్న ఆహార అలవాట్లూ, శ్రమతో విశ్రాంతి లేని పని చేసే వారికి, ప్రసవించిన తర్వాత ఈ సమస్య మనల్ని పట్టి ఎంతో తీవ్రమైన ఇబ్బందికి అసహనానికి గురి చేస్తుంది.
ప్రస్తుత కాలంలో సర్వసాధరణమైన హెమరాయిడ్స్ లేదా పైల్స్ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఇందుకు కారణం ప్రస్తుతం మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు వల్ల ఈ వ్యాధి బారిన పదుతున్నారు. సాధారణంగా ఇది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధే.కాని జీవన శైలిలో మార్పుల వల్ల పైల్స్ ఏర్పడుతున్నాయి.
హెమరాయిడ్స్ని సామాన్య పరిభాషలో పైల్స్ అంటారు. తెలుగుభాషలోలో వీటిని మొలలు అని అంటారు. కదలకుండా ఒకే ప్రదేశంలో కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉన్నవారికి తరచుగా వచ్చే సమస్య పైల్స్. అందుకు కారణం సరియైనా ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు, మలబద్ధకం వంటి వాటితోనే ఈ సమస్య ఏర్పడుతుంది.పైల్స్ రావటానికి ముఖ్యంగా నీరు తక్కువగా త్రాగడం, మద్యం అతిగా సేవించుటం, ఫాస్ట్ ఫుడ్స్, వేపుళ్లు అతిగా తినడం, మాంసాహరం తరుచుగా తినటం వాటి వల్ల వస్తాయి.

*ఇక పైల్స్ వచిన వారిలో ఉండే లక్షణాలు
మల విసర్జన సాఫీగా జరుగదు. తీవ్రమైన నొప్పి, రక్తస్రావం, మంట వుంటాయి. అప్పుడప్పుడు రక్తం పడుతుంది. మల విసర్జన అనంతరం కూడా కొందరిలో నొప్పి మంట రెండు గంటల వరకు ఉంటుంది. విరోచనం కాకపోవడం వీరికి బాధ కలిగిస్తుంది. సుఖ విరోచనం కాకపోవడంతో చిరాకుగా కోపంగా ఉంటారు. మల విసర్జన సమయంలో మొలలు (పైల్స్) బయటకు పొడుచుకొని వచ్చి బాధిస్తాయి.మనుషులు చురుకుగా ఉండలేరు. ఎక్కడికంటే అక్కడికి ప్రయాణాలు చేయలేరు.

పైల్స్/మొలలు నివారణకు 10 చిట్కాలు
1. దానిమ్మ: హెమరాయిడ్స్ కు మరో చక్కటి హోరెమడీ ఎర్రని పండ్ల తొక్క బాగా సహాయపడుతుంది. కొన్ని నీళ్ళలో దానిమ్మ తొక్కను వేసి బాగా ఉడికించి, వడగట్టి రోజుకు ఒకటి రెండు సార్లు తాగుతుండాలి.

2. అల్లం -నిమ్మరసం జ్యూస్: పైల్స్ కు డీహైడ్రేషన్ కూడా ఒక ప్రధానకారణం. అందువల్ల అల్లం, నిమ్మరసం, తేనె కలిపిన జ్యూస్ ను ప్రతి రోజూ రెండు సార్లు తాగాలి.

To Top

Send this to a friend