త్రివిక్రమ్‌ దృష్టిలో సమంత వారసురాలు ఎవరో ?


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ స్టార్‌ డైరెక్టర్‌ వరుసగా మూడు చిత్రాల్లో హీరోయిన్‌గా సమంతను చేయించాడు. ఇలా ఒక దర్శకుడు ఏకంగా మూడు సినిమాల్లో ఒకే హీరోయిన్‌తో కలిసి వర్క్‌ చేయడం ఇటీవల కనిపించడం దాదాపు అసాధ్యం. కాని త్రివిక్రమ్‌ మాత్రం తనకు నచ్చిన హీరోయిన్స్‌తో మళ్లీ మళ్లీ వర్క్‌ చేస్తూనే ఉంటాడు. ఆ మద్య ఇలియానాను రెండు సినిమాల్లో బుక్‌ చేసిన త్రివిక్రమ్‌ ఇప్పుడు కొత్తగా అనూ ఎమాన్యూల్‌ను ఎంపిక చేస్తున్నాడు.

ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుంది. ఆ సినిమాలో ఒక హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ నటిస్తుండగా, మరో హీరోయిన్‌గా అనూ ఎమాన్యూల్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. ఒక చిన్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అను ఎమాన్యూల్‌ తాజాగా పవన్‌తో నటించే అవకాశం రావడంతో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌ అయ్యింది. త్రివిక్రమ్‌ తర్వాత సినిమా ఎన్టీఆర్‌తో చేయబోతున్నాడు.

త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో సినిమాకు కూడా ఒక హీరోయిన్‌గా అను ఎమాన్యూల్‌ను బుక్‌ చేసినట్లుగా తెలుస్తోంది. వరుసగా త్రివిక్రమ్‌ సినిమాల్లో నటిస్తూ ఈమె మరో సమంత అనిపించుకుంటుంది. సమంత వివాహం కాబోతున్న నేపథ్యంలో త్రివిక్రమ్‌ ఆమెపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అందుకే ఇప్పుడు అను ఎమన్యూల్‌ వెంట పడుతున్నాడు. ఎన్టీఆర్‌ కూడా ఇప్పటికే అనుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

To Top

Send this to a friend