అయ్యవార్లు ఇక సైలెంట్‌ అయినట్లేనా?

అల్లు అర్జున్‌ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డీజే’. ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. ఈనెల చివర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా విడుదలైన గుడిలో బడిలో.. పాట వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే. బ్రహ్మణ సమాజంను కించపర్చేలా ఆ పాటలోకి కొన్ని పదాలు ఉన్నాయని, దైవ పూజకు ఉపయోగించే పదాలను రొమాంటిక్‌ డ్యూయేట్‌కు వాడటంపై బ్రహ్మణులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే.

పాటపై వస్తున్న విమర్శలు మరియు నిరసనలకు దర్శకుడు హరీష్‌ శంకర్‌ స్ట్రాంగ్‌గా స్పందించాడు. సినిమాను ముగించే పనిలో చాలా బిజీగా ఉన్నా కూడా విమర్శలకు చెక్‌ పెట్టేందుకు హరీశ్‌ శంకర్‌ మీడియా ముందుకు వచ్చాడు. ఒక ప్రముఖ ఛానల్‌తో మాట్లాడుతూ.. తానో బ్రహ్మణ కుటుంబం నుండి వచ్చిన వాడిని. తాను ఎట్టి పరిస్థితుల్లో బ్రహ్మణ సమాజంను విమర్శించడం కాని, బ్రహ్మణులను కించపర్చడం కాని, దైవ దూషణ కాని చేయను. హిందువుగా పుట్టినందుకు ఎంతో గర్వ పడుతున్నాను.

బ్రహ్మణులు ఆరోపిస్తున్నట్లుగా ఆ పాటలో ఎలాంటి తప్పు లేదు. ఒక బ్రహ్మణ యువకుడు ప్రేమలో పడితే ఆ పదాలను వాడకుండా మరే పదాలతో పాటను చేస్తారు అంటూ ప్రశ్నించాడు. సినిమా విడుదల బిజీలో ఉన్నాం. త్వరలోనే ఆ పాటపై ఉన్న అనుమానాలను మా పాటల రచయితతో మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తాం అంటూ హరీష్‌ శంకర్‌ క్లారిటీ ఇచ్చాడు. దీంతో అయ్యవార్లు సైలెంట్‌ అవుతారా లేక వివాదాన్ని కొనసాగిస్తారా అనేది చూడాలి.

To Top

Send this to a friend