సిగ్గులేకుండా చెప్పేసిన టబు!!


తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన టబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులు అంతా కూడా నాగార్జున మాజీ లవర్‌ టబు అంటూ ఇప్పటికి అనుకుంటూనే ఉన్నారు. అయితే నాగార్జున మరియు టబులు మాత్రం ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు దాటవేస్తూ, కొట్టిపారేస్తూ వచ్చారు. ఇక తాజాగా టబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. తన పెళ్లికి ఆ హీరో పెద్ద అడ్డు అయ్యాడు అంటూ టబు సంచలన వ్యాఖ్యలు చేసింది.

టబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా పెళ్లి కాకపోవడంకు వంద శాతం కారణం అజయ్‌ దేవగన్‌. ఆయనతో 25 సంవత్సరాల అనుబంధం నాకు ఉంది. అప్పట్లో నా కజిన్‌కు అజయ్‌ మిత్రుడు. అలా నాతో కూడా సన్నిహితంగా ఉండే వాడు. అప్పుడు నాతో ఎవరైనా మాట్లాడినా, నన్ను చూసినా కూడా అజయ్‌ వారితో గొడవ పడేవాడు. దాంతోనన్ను ఎవరు కూడా ఇష్టపడలేదు. కాని అజయ్‌ మాత్రం వేరే ఆమెను పెళ్లి చేసుకుని వెళ్లి పోయాడు.

అజయ్‌ వేరే పెళ్లి చేసుకున్నా కూడా నా పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. ప్రతి విషయంలో కూడా నన్ను పరిగణలోకి తీసుకుంటాడు అజయ్‌ దేవగన్‌ . ఆయన కుటుంబ సభ్యుల్లో కూడా నాకు మంచి గౌరవం ఉంది. అందరితో సన్నిహిత్యం ఉందని చెప్పుకొచ్చింది. అంత అభిమానం ఉన్న వ్యక్తి ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే విషయాన్ని మాత్రం టబు చెప్పలేదు. ప్రస్తుతం అజయ్‌ దేవ్‌గన్‌తో ఒక చిత్రంలో నటిస్తుంది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇలా మట్లాడినట్లుగా చెబుతున్నారు.

To Top

Send this to a friend