విశాల్‌ మళ్లీ రియల్‌ హీరో అనిపించుకున్నాడు


తమిళ హీరో విశాల్‌ సినిమాల్లోనే కాకుండా రియల్‌ లైఫ్‌లో కూడా హీరో అనిపించుకుంటూ ఉంటాడు. ఆయన రైతుల కోసం పోరాటం చేయడం, వరద బాదితులను స్వయంగా వెళ్లి రక్షించడం ఇంకా కష్టాల్లో ఉన్న నటీనటులను ఆదుకోవడం వంటి కారణం వల్ల విశాల్‌ను రియల్‌ హీరో అంటూ ఉంటారు. ఇక ఈసారి విశాల్‌ మామూలుగా కాదు ఓ రేంజ్‌లో హీరోయిజంను ప్రదర్శించాడు. అది కూడా తమిళులు అంటే పీకల్లోతు కోపంను ప్రదర్శించే కర్ణాటక రాజధాని బెంగళూరులో. విశాల్‌ సాహసంకు అంతా కూడా ఫిదా అవుతున్నారు.

తమిళనాడు, కర్ణాటకల మద్య కావేరి జలాల వివాదం కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న విషయం తెల్సిందే. ఆ విషయం గురించి ఎవరు మాట్లాడినా కూడా కర్ణాటక ప్రజలు వారిపై తీవ్ర ఆగ్రహంను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇక తమిళ సినీ పరిశ్రమకు చెందిన వారు ఎవరైనా ఆ విషయాన్ని లేవనెత్తితే వారి సినిమాలు కర్ణాటకలో విడుదల కాకుండా చేస్తారు. ఇలా కన్నడ వారు తమిళులపై ఆగ్రహం పెంచుకున్నారు. అలాంటి సమయంలో విశాల్‌ బెంగళూరులోనే కావేరి జలాల విషయం లేవనెత్తాడు.

విశాల్‌ మాట్లాడుతూ కావేరి జలాలపై తమిళులకు కూడా హక్కు ఉందని, దాన్ని ఏ ఒక్కరు కాదనలేరు అంటూ పేర్కొన్నాడు. కర్ణాటకలో ఉన్న తమిళులను మీరు కాపాడండి, తమిళనాడులో ఉన్న కన్నడీగులను మేం కాపాడుతాం అంటూ కన్నడ ప్రేక్షకులతో చెప్పుకొచ్చాడు. విశాల్‌ వ్యాఖ్యలపై అప్పుడే అక్కడ చిచ్చు మొదలైంది. ఆయన సినిమాలను విడుదల కానిచ్చేది లేదు అంటున్నారు.

To Top

Send this to a friend