‘డీజే’పై మైండ్‌ బ్లోయింగ్‌ పంచ్‌ వేసిన నాని


యువ హీరో నాని తాజాగా నటించిన ‘నిన్ను కోరి’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నాని మీడియాతో మాట్లాడాడు. ఆ సందర్బంగానే మీడియా వారు మీ సినిమాకు ఇటీవల మంచి కలెక్షన్స్‌ వస్తున్నాయి, మీరు ఒక మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఈ విషయం పట్ల మీ స్పందన ఏంటి అంటూ ప్రశ్నించాడు. అందుకు నాని కాస్త వింత సమాధానం చెప్పాడు. తనకు కలెక్షన్స్‌పై పెద్దగా నమ్మకం లేదని, తాను కలెక్షన్స్‌ను నమ్మను అని చెప్పుకొచ్చాడు.

ఇంకా నాని మాట్లాడుతూ.. ఇటీవల సినిమా బాగా లేకున్నా కూడా మంచి కలెక్షన్స్‌ వస్తున్నట్లుగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అది ఎలా సాధ్యం. సినిమా బాగాలేకున్నా, ప్రేక్షకులు రాకున్నా కలెక్షన్స్‌ ఎలా వస్తాయో వారికే తెలియాలి అన్నాడు. ఈ వ్యాఖ్యలు తాజాగా విడుదలైన అల్లు అర్జున్‌ ‘డీజే’ చిత్రంపై పంచ్‌లుగా కొందరు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

అల్లు అర్జున్‌ నటించిన ‘డీజే’ చిత్రంకు ప్రేక్షకుల నుండి మరియు రివ్యూవర్స్‌ నుండి కూడా నెగటివ్‌ టాక్‌ వచ్చింది. అయినా కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా, ఇంతా కలెక్షన్స్‌ వచ్చాయి అని ప్రచారం చేస్తున్నారు. ఆ కలెక్షన్స్‌లో నిజం ఎంత అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. అందుకే నాని ‘డీజే’ సంబంధించి ఆ వ్యాఖ్యలు చేశాడేమో అని కొందరు అంటున్నారు. ‘నిన్నుకోరి’ చిత్రం మరో విజయాన్ని నాని ఖాతాలో వేయడం ఖాయం అని సినీ వర్గాల వారు అంటున్నారు.

To Top

Send this to a friend