బిగ్ బాస్ లో 50లక్షలు గెలిచేది ఈమెనట..

బిగ్ బాస్ లో ప్రస్తుతం అత్యంత యాక్టివ్ గా ఉంటున్న సెలబ్రెటీ హరితేజ. మొదట హరితేజను బిగ్ బాస్ లోకి తీసుకోవడానికి ప్రధాన కారణం.. దర్శకుడు త్రివిక్రమ్ అట. అఆ సినిమాలో హరితేజ నటనకు ఫిదా అయిన త్రివిక్రమ్ ఆమెను బిగ్ బాస్ లోకి తీసుకోమని ఎన్టీఆర్ కు చెప్పాడట… దీంతో ఆమెను ఎంపిక చేశారని సమాచారం. ఇప్పుడామే బిగ్ బాస్ విజేతల్లో ఒకరిగా ప్రచారం జరగడంతో ఎన్టీఆర్ కూడా ఆమెకే మద్దతు తెలుపుతున్నట్టు సమాచారం.

బిగ్ బాస్ షో అలరిస్తోంది.. ఈ శని, ఆదివారాల్లో డబుల్ ధమాకాలో ఇద్దరిని బయటకు పంపారు. ధన్ రాజ్ , కత్తికార్తీకలు హౌస్ నుంచి వెళ్లిపోయారు..ధన్ రాజ్ ఎలిమినేషన్ సందర్భంగా ఎన్టీఆర్ పలు ప్రశ్నలు అడిగాడు. 41 రోజులుగా హౌస్ లో ఉంటున్నావ్ కదా.. ఈ బిగ్ బాస్ సీజన్ 1 టైటిల్ ఎవరు గెలుస్తారో చెప్పు అని ఎన్టీఆర్ .. ధన్ రాజ్ ను సూటిగా ప్రశ్నించాడు. దానికి ధన్ రాజ్.. ‘మగవాళ్లలో ఆదర్ష్, ఆడవాళ్లలో అయితే హరితేజ’ బిగ్ బాస్ సీజన్ 1 టైటిల్ గెలుస్తారని కుండబద్దలు కొట్టారు. దీంతో బిగ్ బాస్ విజేతల్లో వీరిద్దరి పేర్లు ప్రస్తుతం ప్రముఖంగా వినపడుతున్నాయి.

To Top

Send this to a friend