ఆంజనేయుడే బయటకొచ్చాడు.

వందల ఏళ్లనాటి గుడి అది. పునరుద్ధారించాలని ఓ ఊరి గ్రామస్థులు అనుకొని గుడి తెరిచి విగ్రహ ప్రతిష్ట కోసం గుడిలో గుంత తవ్వుతుండగా ఓ గది కన్పించింది. తవ్వి చూడగా అందులో పంచలోహ, అద్భుత 16వ శతాబ్ధం నాటి పెరుమాళ్ల విగ్రహం, ఇద్దరు అమ్మవార్లతో కలిసి ఉన్నవి దొరికాయి. వీటిపై పోలీసులకు సమాచారమందించగా.. పురావస్తు శాఖ వారు వచ్చి ఆ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. చోళుల కాలం నాటి విగ్రహాలని.. ఇవి మార్కెట్లో వందల కోట్ల విలువ ఉంటుందని ప్రభుత్వానికి అప్పగించాల్సిందేనని గ్రామస్థులను కోరారు. కానీ గ్రామస్థులు విగ్రహాలను మా గుడిలోనే ప్రతిష్టిస్తామని చెప్పారు. పోలీసులు సర్ధి చెప్పడంతో వివాదం సద్దుమణిగింది..

ఆ ఆలయం 16వ శతాబ్ధం నాటిది.. చోళుల కాలంలో కట్టింది. వాస్తుదోషం అని లేకో అరిష్టం అనో తెలియదు కానీ కొన్ని దశాబ్ధాల క్రితం ఆ ఆలయాన్ని మూసివేశారు. గ్రామంలోని కొందరు గ్రామస్థులు ధైర్యం చేసి ఆ ఆలయాన్ని తెరవాలని నిర్ణయించారు. పూజలు చేసి తెరిచారు. ఆశ్చర్యం ఆ గుడిలో చూసి షాక్ తిన్నారు.. తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా నవకుర్చి అనే గ్రామంలో మూసివున్న ఆ ఆలయాన్ని ఇటీవలే గ్రామస్థులు తెరిచారు.. తెరిచిచూస్తే ఆంజనేయ స్వామి విగ్రహం గర్భగుడిలో కాకుండా బయటకొచ్చి ఉండడం చూసి గ్రామస్థులు షాక్ తిన్నారు.

వాస్తు ప్రకారం బాగా లేదని ఆంజనేయుడే ఇలా వేరే స్థలంలోకి వచ్చారని గ్రామస్థులందరూ ఆశ్చర్యపోయి ఇది దేవుడి మహత్యం అంటూ పూజలు చేయడం ప్రారంభించారు. ఇక వాస్తు పండితులతో మాట్లాడి సరిచేసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం గుడిలో గుంతలు తవ్వుతుండగా మరో ఆశ్చర్యం వెలుగు చూసింది.. ఇలా ఆంజనేయ స్వామి విగ్రహం గ్రామస్థులకు షాక్ ఇస్తే.. విగ్రహాలు బయటపడడంతో ఇక ఈ గుడి స్వయంభూ దేవాలయం అని తండోపతండాలు జనం వచ్చి చూసి వెళుతున్నారు.

To Top

Send this to a friend