‘గురు’కష్టాలు.. వెంకీకీ లాభాలే..


తెలుగు ప్రేక్షకుల అభిరుచి వేరుగా ఉంటుంది. మూస కథలు ఎప్పుడూ ఇక్కడ హిట్ కావు. కొత్తదనం ఏ భాష నుంచి వచ్చిన స్వీకరిస్తారు. అందుకే బిచ్చగాడు లాంటి కథాబలం ఉన్న చిత్రాలకు కూడా ఇక్కడ జననీరాజనం ఉంటుంది. అందుకే చాలామంది తమిళహీరోలు, దర్శకులు కూడా ఇక్కడ పాగా వేస్తున్నారు.

జీవిత చరిత్రలు, క్రీడా నేపథ్య కథలు తెలుగులో ఆడింది లేదు.. అందుకే మన హీరోలు ఎప్పుడూ అలాంటి కథల జోలికి వెళ్లరు.. కానీ విక్టరీ వెంకటేశ్ ఆ దిశగా అడుగులు వేశాడు. హిందీ, తమిళంలో హిట్ అయిన క్రీడా నేపథ్య కథను వెంకీ ఎంచుకొని చేశాడు. ఇది చాలా లోబడ్జెట్ మూవీ అట.. తమిళంలో తీసిన సీన్లు, హీరోయిన్ ఫైట్లను యథాతథంగా ఉంచేశారట.. ఒక వెంకటేశ్ పాత్ర సీన్లనే రీ ష్యూట్ చేశారట.. దీంతో చాలా తక్కువ ఖర్చులో గురు సినిమా పూర్తయిపోయింది. ఇక హీరోగా నటించిన వెంకీకి ముందుగా డబ్బులివ్వకుండా శాటిలైట్ రైట్స్ ఇచ్చేశారట.. అవి ఎంతలేదన్నా ఓ 5-10 మధ్య పలకవచ్చు. దీంతో కొద్దిరోజులకే వెంకీకి భారీ మొత్తం లభించినట్టే… సినిమా హిట్ ప్లాప్ లతో సబంధం లేకుండా ఈ మొత్తం వెంకీకి ఇవ్వడానికి నిర్మాతలు ప్లాన్ చేశారట..

ఇక గురు సినిమా విడుదలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ క్రీడా నేపథ్య సినిమాపై అటు జనంలోను, ఇటు డిస్ట్రిబ్యూటర్లలోనూ ఆసక్తి లేదు. దీంతో చేసేందేం లేక.. వెంకటేశ్ అన్నయ్య సురేష్ ప్రొడక్షన్స్ ఓనర్ సురేష్ బాబే నేరుగా విడుదల చేస్తున్నారు. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఉండడంతో సినిమాను అలా కానిచ్చేస్తున్నారు.

To Top

Send this to a friend